చిరు ట్వీట్‌కు తెలంగాణ డీజీపీ ఇంట్రెస్టింగ్ రిప్లయ్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని నిర్మూలించడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఓ వైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేస్తున్న పోలీసులపై ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తు్న్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా పోలీసులను పొగడ్తలతో ముంచెత్తుతూ ఓ వీడియో షేర్ చేశారు. పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందని.. వారివల్లే లాక్‌డౌన్‌ సక్సెస్‌ అయిందని చిరు చెప్పారు. అంతేకాదు.. నిద్రాహారాలు మాని ప్రజల కోసం కష్టపడుతున్నారని చిరు వీడియోలో తెలిపారు.

సెల్యూట్ చేస్తున్నా..

పోలీస్‌ చర్యలు, లాక్‌డౌన్‌ విజయవంతం వల్లే కరోనా అదుపులోకి వచ్చిందని.. కరోనా వైరస్‌ను తరిమికొట్టడంలో పోలీస్‌ సిబ్బందికి ప్రజలు సహకరించాలని చిరు కోరారు. ఈ సందర్భంగా తాను పోలీస్ బిడ్డనన్న విషయాన్ని చిరు మరోసారి గుర్తు చేశారు. ‘పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ చేస్తున్న సేవలకు.. ఒక పోలీస్‌ బిడ్డగా సెల్యూట్‌ చేస్తున్నా’ అని చిరంజీవి ఒకింత గర్వంగా వీడియోలో చెప్పారు. ఈ వీడియోను మెగాభిమానులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున షేర్ చేశారు.

డీజీపీ ఇంట్రెస్టింగ్ రిప్లయ్..

చిరు వీడియోకు ట్విట్టర్ వేదికగా డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ‘మీరు కేవలం మాకు మాత్రమే ప్రేరణ కలిగించలేదు.. కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగించారు. మీ నుంచి స్ఫూర్తిని పొందే ఎంతో మందిని మేల్కొలిపారు. ఒక పోలీసు కుటుంబం నుంచి వచ్చిన మీ నుంచి వచ్చిన మాటలు.. కరోనాపై పోరాటంలో మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మీ సందేశం ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేస్తాయి’ అని డీజీపీ ఇంట్రెస్టింగ్‌గా ట్వీట్‌లో రాసుకొచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ తాలుకూ ట్వీట్స్‌ను మెగాభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

More News

మద్యం డోర్ డెలివరీపై ఆర్జీవీ ట్వీట్.. కేటీఆర్ పంచ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.

రామ్‌చ‌ర‌ణ్‌ హీరోయిన్ ఇప్పుడు బన్నీకి స్పెషల్

టైటిల్ చ‌దివిన త‌ర్వాత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా క్యాంప్ హీరోలే. వీరిద్ద‌రూ ఒక‌రికొక‌రు ఏం చేసుకున్నారు? అనే సందేహం రావ‌చ్చు.

కన్న‌డ‌లో రీమేక్‌కానున్న అడివి శేష్ చిత్రం..?

ఈ మ‌ధ్య తెలుగు సినిమాల ట్రెండ్ మారింది. డిఫరెంట్ సినిమాలు రూపొందుతున్నాయి. కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయ‌డానికి హీరోలు, చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపుతున్నారు.

లేడీ విలన్‌తో బాలయ్య ఢీ..?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తానంటోన్న రానా !!

రానా ద‌గ్గుబాటి హీరోగా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా రాణిస్తున్నారు. ఇటీవ‌ల కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.