తెలంగాణలో రెండో రోజు 2 వేల మార్కును దాటేసిన కరోనా కేసులు..

  • IndiaGlitz, [Sunday,August 23 2020]

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రంలో కరోనా కేసులు రెండు వేల మార్కును దాటేశాయి. దీంతో ప్రజానీకం భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కాగా.. గడిచిన 24 గంటల్లో 40,666 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 2384 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య లక్షా 4,249కి చేరుకుంది.

కాగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 755కు చేరుకుంది. కాగా.. నిన్న ఒక్కరోజే 1851 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. ఇప్పటి వరకూ మొత్తం 80,586 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 22,908 ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,387 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

తెలంగాణలోని కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 472 కేసులు నమోదు కాగా.. జగిత్యాల-105, ఖమ్మం-105, కరీంనగర్- 125, నల్గొండ-137, నిజామాబాద్-148, రంగారెడ్డి-131, సూర్యాపేట - 110 కేసులు నమోదయ్యాయి. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 9 లక్షల 39,839 పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.