తమ కొడుక్కి సోనూసూద్ పేరు పెట్టుకున్న తెలంగాణ దంపతులు
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ ముందు కేవలం నటుడిగానే అందరికీ సుపరిచితుడైన సోనూసూద్.. కోవిడ్ తర్వాత హీరో అయ్యాడు. కొన్ని వందల మందికి తన పరిధిని మించి సాయం చేశాడు. ఇప్పటికీ ఎంతో మంది సాయం కోసం సోనూసూద్‌ను కలుస్తూనే ఉన్నారు. ఆయన కూడా కాదనకుండా తోచిన సాయం చేస్తూనే ఉన్నాడు.సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసిన చాలా మంది ప్రజలు ఆయనపై వివిధ రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొందరు సోనూసూద్‌కు గుళ్లు కడితే, కొందరు తమ షాపులకు, పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకుంటారు.
ఇప్పుడు అదే బాటలో తెలంగాణకు ఖమ్మం జిల్లా ముష్టికుంట్ల గ్రామంలోని పండగరాజు, మంగమ్మ దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. ఆ బాబుకి సోనూసూద్ అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 2న పిల్లాడికి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు రావాలంటూ సోనూసూద్‌కు కూడా ఆహ్వానం అందింది. మరి సోనూసూద్ ఈ కార్యక్రమానికి వెళతాడా? లేదా? అని ఇంకా తెలియడం లేదు. సోనూసూద్ కోవిడ్ ఎఫెక్ట్‌లో వేలాది మంది వలస కార్మికులను వారి ఊర్లకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అంతే కాకుండా ముంబైలో కొన్నివేల మందికి భోజన వసతిని కల్పించాడు. ఉద్యోగాలు అందించడంలో కీలక పాత్రను పోషించాడు. అప్పటి వరకు వెండితెరపై విలన్‌గా ఉన్న సోనూసూద్ ఈ చర్యలతో నేషనల్ హీరో అయ్యాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com