తెలంగాణలో నేడు 2 వేలు దాటిన కరోనా కేసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేడు కరోనా కేసుల సంఖ్య 2 వేలు దాటడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 21,011 పరీక్షలు నిర్వహించగా.. 2083 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 64,786కు చేరుకుంది. కాగా నేడు 1114 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని మొత్తంగా 46,502 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం తెలంగాణలో 17754 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 530కి చేరుకుంది. కాగా... నేడు కూడా ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 578 కేసులు నమోదవగా.. ఆ తరువాత ఎక్కువగా రంగారెడ్డి 228, వరంగల్ అర్బన్ 134, మేడ్చెల్-197, కరీంనగర్-108, సంగారెడ్డి-101 లలో కేసులు నమోదు అయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout