Congress:చేవేళ్లలో ప్రజా గర్జన : ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన టీ.కాంగ్రెస్.. ముఖ్యాంశాలివే
- IndiaGlitz, [Sunday,August 27 2023]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు తాయిళాలు ప్రకటిస్తోంది. ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా చేవేళ్లలో జరిగిన ప్రజా గర్జన సభలో దళిత, గిరిజనులను ఆదుకునేందుకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది . ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించిన ముఖ్యాంశాలు:
అంబేడ్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12లక్షలు
కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం.
పోడు భూములకు పట్టాలు
ఎస్సీ, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు
ప్రతి కార్పోరేషన్ ద్వారా రూ.750 కోట్లు మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షలు
రాష్ట్రంలో కొత్తగా ఐదు ఐటీడీఏలు ఏర్పాటు
టెన్త్ పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.10 వేలు
ఇంటర్ పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ. 15 వేలు
డిగ్రీ పాసైన దళిత, గిరిజన విద్యార్ధులకు రూ.25 వేలు
పీజీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.లక్ష
ప్రతి మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు
గ్రాడ్యుయేషన్, పీజీ చదివే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు వసతి