Congress:చేవేళ్లలో ప్రజా గర్జన : ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన టీ.కాంగ్రెస్.. ముఖ్యాంశాలివే

  • IndiaGlitz, [Sunday,August 27 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు తాయిళాలు ప్రకటిస్తోంది. ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా చేవేళ్లలో జరిగిన ప్రజా గర్జన సభలో దళిత, గిరిజనులను ఆదుకునేందుకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది . ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిన ముఖ్యాంశాలు:

అంబేడ్కర్‌ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12లక్షలు
కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం.
పోడు భూములకు పట్టాలు
ఎస్సీ, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు
ప్రతి కార్పోరేషన్ ద్వారా రూ.750 కోట్లు మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షలు
రాష్ట్రంలో కొత్తగా ఐదు ఐటీడీఏలు ఏర్పాటు
టెన్త్ పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.10 వేలు
ఇంటర్ పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ. 15 వేలు
డిగ్రీ పాసైన దళిత, గిరిజన విద్యార్ధులకు రూ.25 వేలు
పీజీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.లక్ష
ప్రతి మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు
గ్రాడ్యుయేషన్‌, పీజీ చదివే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు వసతి

More News

Kangana Ranaut:నా కెరీర్‌లో 'చంద్రముఖి 2' వంటి గొప్ప సినిమా చేయలేదు - కంగనా రనౌత్

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్  రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’.

Nara Lokesh:నోరుజారిన ఫలితం : నారా లోకేష్‌పై విమర్శల వర్షం.. పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ, వైసీపీ తేలిగ్గా వదలదు

తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Rahul Sipligunj :ఎమ్మెల్యేగా పోటీ అంటు ప్రచారం ... పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది.

Nara Lokesh:ఫ్రస్ట్రేషనా, ఆక్రోశమా : ఏంటిది లోకేషా.. తేడా వస్తే బలయ్యేది కార్యకర్తలే

యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌‌లో నానాటికీ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది.

Tamil Nadu:తమిళనాడులో ఘోర ప్రమాదం.. రైల్లోకి అక్రమంగా సిలిండర్ , టీ చేస్తుండగా బ్లాస్ట్.. పది మంది సజీవదహనం

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. మధురై రైల్వే స్టేషన్ సమీపంలో ఆగివున్న రైలు బోగీలో శనివారం తెల్లవారుజామున 5.15 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.