Telangana Congress:తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. పంతం నెగ్గించుకున్న మైనంపల్లి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 55 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం తాజాగా విడుదల చేసింది. కొడంగల్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజుర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి పోటీ చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంత్ రావు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. మెదక్ నుంచి ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ రావు, మల్కాజ్ గిరి నుంచి హన్మంత్ రావు బరిలో దిగనున్నారు. నకిరేకల్ నుంచి వేముల వీరేశం టికెట్ దక్కించుకున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..
కొడంగల్- రేవంత్ రెడ్డి
గద్వాల్- సరితా తిరుపతయ్య
అలంపూర్- సంపత్ కుమార్
నాగర్‌కర్నూల్- రాజేశ్ రెడ్డి
అచ్చంపేట- చిక్కుడు వంశీ కృష్ణ
కల్వకుర్తి- కాసిరెడ్డి నారాయణ రెడ్డి
షాద్‌నగర్- శంకరయ్య
కొల్లంపూర్- జూపల్లి కృష్ణారావు
నాగార్జున సాగర్- జయవీర్
హుజూర్నగర్- ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కోదాడ- పద్మావతి రెడ్డి
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నక్రేకల్- వీరేశ్
ఆలేరు- ఐలయ్య
ఘనపూర్- ఇందిరా
నర్సంపేట- మాధవ్ రెడ్డి
భూపాల్పల్లి-సత్యనారాయణ రావు
ములుగు-సీతక్క
మధిర- భట్టి విక్రమార్క
భద్రాచలం- వీరయ్య
బెల్లంపల్లి - గడ్డం వినోద్
మంచిర్యాల- ప్రేమ్‌సాగర్
నిర్మల్- వినయ్ కుమార్
బోధన్- సుదర్శన్ రెడ్డి
ఆర్మూర్- వినయ్‌కుమార్ రెడ్డి
బాల్కొండ- ముత్యాల సునీల్ కుమార్
జగిత్యాల- జీవన్ రెడ్డి
ధర్మపురి-ఆదూరి లక్ష్మణ్ కుమార్
రామగుండం-ఎంఎస్ రాజ్ ఠాకూర్
మంథని- దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పెద్దపల్లి- చింతకుంట విజయరామారావు
వేములవాడ- ఆది శ్రీనివాస్
మానుకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ
మెదక్- మైనంపల్లి రోహిత్‌రావు
ఆందోల్- దమోదర్ రాజనరసింహ
జహీరాబాద్- చంద్రశేఖర్
సంగారెడ్డి-తూర్పు జగ్గారెడ్డి
గజ్వేల్- తూముకుంట నర్సారెడ్డి
మేడ్చల్ - తోటకూర వజ్రేష్ యాదవ్
మల్కాజిగిరి- మైనంపల్లి హనుమంతురావు
కుత్బుల్లాపూర్- కొలను హనుమంత రెడ్డి
ఉప్పల్- పరమేశ్వర్ రెడ్డి
చేవెళ్ల-పేమెన భీంభరత్
పరిగి- రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్-గడ్డం ప్రసాద్ కుమార్
ముషిరాబాద్- అంజన్ కుమార్ యాదవ్
మలక్‌పేట- షేక్ అక్బర్
సనత్‌నగర్- కోట నీలిమ
నాంపల్లి- మహ్మద్ ఫిరోజ్ ఖాన్
ఖార్వాన్- ఒస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రి
గోషామహాల్- మొగిలి సునీత
చాంద్రయాన్ గుట్ట- బోయనగేష్
యాకుత్ పురా- రవిరాజు
బహుదుర్పూర్- రాజేష్ కుమార్ పులిపాటి
సికింద్రాబాద్- సంతోష్‌కుమార్
ఇక మిగిలిన నియోకజకవర్గాలకు మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈనెల 18వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆ లోపే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com