close
Choose your channels

Kumari Aunty: కుమారీ ఆంటీకి అండగా నిలిచిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Wednesday, January 31, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కుమారీ ఆంటీకి అండగా నిలిచిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారి ఆంటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్‌ సెంటర్‌ను యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పాత స్థలంలోనే వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చని.. రోడ్లపై ట్రాఫిక్ జాం కాకుండా చూడాలని డీజీపీకి సూచించారు. అలాగే త్వరలోనే కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ను సందర్శిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రజా పాలనలో చిరు వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి పీఆర్వో అయోధ్యరెడ్డి ట్వీట్ చేశారు.

మరోవైపు టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ కూడా కుమారి ఆంటీకి మద్దతు తెలిపారు. ఆమెకు వీలైనంత సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా చిన్న ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తున్నారు. చవకగా, రుచికరమైన వెజ్, నాన్ వెజ్ వెరైటీలతో ఫుడ్ అందిస్తున్న ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ఆంటీ పేరు మార్మోగడంతో యువత అంతా ఆమె దగ్గర భోజనం చేసేందుకు ఎగబడుతున్నారు. ఫలితంగా అక్కడ రద్దీ ఎక్కువై రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది.

కుమారీ ఆంటీకి అండగా నిలిచిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్‌కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా షాప్ క్లోజ్ చేయించారు. పోలీసులు తీరుతో కుమారి ఆంటీ కన్నీటి పర్యంతమయ్యారు. జీవనాధారం అయిన ఫుడ్ స్టాల్ మూసివేయడంతో తాము ఎలా బతకాలని లబోదిబోమన్నారు. గిట్టని వాళ్లే పోలీసుల చేత ఇలా చేయించారని ఆరోపించారు. ఈ వార్త వైరల్ కావడంతో తెలంగాణ సీఎంవో స్పందిస్తూ ఆమెకు రేవంత్ రెడ్డి అండగా ఉంటారని తెలిపింది.

కాగా ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి.. మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా 2011లో ఫుడ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. కేవలం 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన ఆమె వ్యాపారం.. ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముతున్నారు. ఇలా స్వయం ఉపాధి పొందుతూ ఎందరో మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment
Related Videos