సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదా ఆసుపత్రికి తరలింపు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం వైద్య పరీక్షల కోసం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. గుండె, యాంజియో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది. అస్వస్థత కారణంగా నేటి యాదాద్రి పర్యటనను సీఎం కేసీఆర్ రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, మనవడు హిమాన్ష్, ఎంపీ సంతోష్ ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు.
రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారని, ఆయన ఎడమ చేయి లాగుతున్నట్లు చెబుతున్నారని యశోద ఆస్పత్రి వైద్యుడు డా.ఎంవీ రావు తెలిపారు. ప్రాథమిక పరీక్షల అనంతరం యాంజియోగ్రామ్ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
ఈ నెల 28న యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభం జరగనున్న నేపథ్యంలో మహా కుంభ సంప్రోక్షణ, అంకురార్పణపై అధికారులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సమీక్ష సమావేశం యథావిధిగానే జరుగుతుందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com