సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదా ఆసుపత్రికి తరలింపు

  • IndiaGlitz, [Friday,March 11 2022]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం వైద్య పరీక్షల కోసం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. గుండె, యాంజియో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది. అస్వస్థత కారణంగా నేటి యాదాద్రి పర్యటనను సీఎం కేసీఆర్ రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, మనవడు హిమాన్ష్‌, ఎంపీ సంతోష్‌ ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు.

రెండు రోజులుగా కేసీఆర్ నీర‌సంగా ఉన్నారని, ఆయ‌న‌ ఎడమ చేయి లాగుతున్నట్లు చెబుతున్నారని యశోద ఆస్పత్రి వైద్యుడు డా.ఎంవీ రావు తెలిపారు. ప్రాథమిక పరీక్షల అనంతరం యాంజియోగ్రామ్‌ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

ఈ నెల‌ 28న యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభం జ‌ర‌గ‌నున్న‌ నేపథ్యంలో మహా కుంభ సంప్రోక్షణ, అంకురార్పణపై అధికారులతో కేసీఆర్ సమీక్షా స‌మావేశం నిర్వ‌హించాల్సి ఉంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లపై కేసీఆర్ దిశానిర్దేశం చేయ‌నున్నారు. అయితే ఈ స‌మీక్ష స‌మావేశం య‌థావిధిగానే జ‌రుగుతుంద‌ని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

More News

ప్రతి షోకి 100 టికెట్లు పంపండి.. థియేటర్‌ యాజమాన్యాలకు బెజవాడ మేయర్ లేఖ, వైరల్

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రభాస్ రాధేశ్యామ్‌కు ఏపీలో టికెట్ల ధరల పెంపు, అయినా మెలిక పెట్టిన జీవో..!!

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హేగ్డే జంటగా నటించిన ‘‘రాధేశ్యామ్’’

పంజాబ్ : పనిచేయని రియల్‌స్టార్ ప్రభావం.. ఓటమిపాలైన సోనూసూద్ సోదరి మాళవిక

పంజాబ్‌లో  సామాన్యుడి దెబ్బకు దిగ్గజ పార్టీలు విలవిలాడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ  ఘన విజయం సాధించింది.

కాంగ్రెస్‌‌కు ఘోర పరాభవం : పంజాబ్‌ మిస్... యూపీలో పనిచేయని ప్రియాంక మంత్రం

ఒకప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏలిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ గడిచిన కొన్నేళ్లుగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోన్న సంగతి తెలిసిందే.

తాగుబోతన్నారు.. ఇప్పుడాయనే కాబోయే పంజాబ్ సీఎం, ‘‘జిలేబీ’’లు సిద్ధం

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది.