CM KCR:హైదరాబాద్‌కు మరో మణిహారం : 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. ప్రత్యేకతలివే
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో బుద్ధుడి విగ్రహం, సచివాలయం, అమరవీరుల స్మారకం వున్నాయని చెప్పారు.
అంబేద్కర్ పేరిట అవార్డ్:
అంబేద్కర్ పేరిట ప్రతి ఏటా అవార్డ్ ఏర్పాటు చేయాలని కత్తి పద్మారావు సూచించారని.. దీనిని పరిగణనలోనికి తీసుకున్నామని సీఎం అన్నారు. అవార్డ్ కోసం రూ.51 కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని.. దీనిపై ఏటా రూ.3 కోట్ల వడ్డీ వస్తుందని ఆయన చెప్పారు. దీని ద్వారా వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారిని అంబేద్కర్ జయంతి రోజున సత్కరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. 2024 ఎన్నికల్లో వచ్చేది మన ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 50 వేల మందికి దళితబంధు అందించామని.. ఈ ఏడాది మరో 1.25 లక్షల మందికి దళితబంధును అమలు చేస్తామని చెప్పారు.
రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా రాళ్లు :
కాగా.. దేశంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలో నెలకొల్పుతామని, స్మృతి వనాన్ని అభివృద్ధి చేస్తామని 2016లో అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే వున్న 11.34 ఎకరాల విస్తీర్ణంలో పనులు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.146.50 కోట్లు. నోయిడా డిజైన్ అసోసియేట్స్‌కు విగ్రహ నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత రాం వన్జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్లు విగ్రహ నమూనాలను తీర్చిదిద్దారు. మూడు దశాబ్ధాల పాటు మెరుస్తూ వుండేలా విగ్రహానికి పాలీయురేతిన్ కోటింగ్ వేశారు. విగ్రహం పీఠం ఎత్తు 50 అడుగులు కాగా, వినియోగించిన ఉక్కు 353 టన్నులు, విగ్రహం బరువు 465 టన్నులు, వినియోగించిన ఇత్తడి 112, వెడల్పు 45 అడుగులు.
పార్లమెంట్ భవనం తరహాలో 2476 చదరపు అడుగుల విస్తీర్ణంలో వృత్తాకారంలో.. చుట్టూ ఎత్తయిన పిల్లర్లతో నిర్మించారు. రాజస్థాన్ నుంచి లేత గోధుమ, ఎరుపు రంగు ఇసుక రాళ్లను తెప్పించారు. ఇక్కడ రాక్ గార్డెన్, ఫౌంటెయిన్, పూలవనాలు, కాలిబాటలు, టాయిలెట్ బ్లాక్, టికెట్ కౌంటర్, సెక్యూరిటీ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు కాన్ఫరెన్స్ హాలు, మ్యూజియం , లైబ్రరీ, ఆడియో విజువల్ హాల్ , ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com