సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం.. మేనమామ కమలాకర్ రావు కన్నుమూత

  • IndiaGlitz, [Sunday,January 30 2022]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనమామ గునిగంటి కమలాకర్ రావు (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కామారెడ్డిలో దేవి విహార్‌లోని తన సొంత ఇంటిలో శనివారం చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన కమలాకర్‌ రావు చాలా కాలం క్రితమే కామారెడ్డిలో స్ధిరపడ్డారు.

ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేనమామ చనిపోయిన విషయం తెలిసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకు చిన్నతనం నుంచి ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తన బాల్యంలో చాలా సార్లు తాను మేనమామ ఇంటికే వస్తుండేవాడినని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పారు. అధికారిక కార్యక్రమాల కోసం కామారెడ్డిలో పర్యటించిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌ తన మేనమామ ఇంటికి వెళ్లేవారు. పదేళ్ల క్రితమే కమలాకర్‌ రావు భార్య చనిపోయారు. ఆ సమయంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతంగా నడుపుతున్నారు.

మరోవైపు, కమలాకర్ రావు భౌతిక కాయాన్ని సందర్శకుల కోసం కామారెడ్డిలోని దేవివిహార్‌లో ఉంచారు. బంధుమిత్రులతో పాటు కొంత మంది స్థానిక టీఆర్ఎస్ నేతలూ సైతం కమలాకర్ రావుకు నివాళులర్పించారు. అనంతరం సమీపంలోని స్మశానవాటికలో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపపథ్యంలో కమలాకర్‌ రావు అంత్యక్రియలకు కేసీఆర్‌ కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు.

More News

సాయిపల్లవిపై బాడీ షేమింగ్‌‌ కామెంట్స్: మహిళల ఎదుగుదలను ఓర్వలేరు.. గవర్నర్ తమిళిసై ఆగ్రహం

నేచురల్ స్టార్ నాని  హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘శ్యామ్ సింగరాయ్’’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

రాజమౌళి ప్రశంసలు అందుకున్న జీ 5 ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 2'... నటుడు శశాంక్

ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'లో విడుదలైన ఒరిజినల్ సిరీస్ 'లూజర్' చూశారా? ఆ సిరీస్‌ను అంత త్వ‌ర‌గా వీక్షకులు మర్చిపోలేరు.

భారత్ పెగాసస్‌ను 2017లోనే కొనుగోలు చేసింది... న్యూయార్క్ టైమ్ సంచలన కథనం

గతేడాది భారత రాజకీయాల్లో ‘‘పెగాసస్’’ ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిపక్షనేతలు, మీడియా సంస్థల అధినేతలు,

ప్రసవం , లాక్‌డౌన్.. ఒంటరితనమే కృంగదీసిందా: యడ్డీ మనవరాలి ఆత్మహత్యపై దర్యాప్తు ముమ్మరం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనవరాలు సౌందర్య మరణం ఆ రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది.