KCR : కవితను పార్టీ మారమన్నారు.. ఇంత అన్యాయమా : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురును పార్టీ మారమని అడిగారని... ఇంతకంటే ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. ఈడీ దాడులు చేస్తే తిరంగబడాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు పది నెలలే ఉందని... బీజేపీతో పోరాడాల్సిందేనని, ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. మళ్లీ పాత వాళ్ళకే టికెట్స్ ఇస్తానని.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జిని నియామిస్తామని కేసీఅర్ అన్నారు.
మనకూ దర్యాప్తు సంస్థలున్నాయి :
మంత్రులు యాక్టివ్‌గా ఉండాలని... ప్రభుత్వ స్కీమ్‌ల గురించి విస్తృతంగా ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని మంత్రులకు కేసీఆర్ సూచించారు. తనతో కలిసి పోరాటానికి సిద్ధమా అని నేతలను సీఎం అడిగారు. ఈ సందర్భంగా పోరాటానికి తాము సిద్ధమే అని చేతులెత్తి సంఘీభావం తెలిపారు నేతలు. కేంద్రానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయని... మనకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి, తేల్చుకుందామన్నారు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు.
సిట్టింగ్‌లకే టికెట్లు:
ఎన్నికలకు పది నెలలే వున్నాయని.. ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో పక్కా ఆధారాలు వున్నాయని.. బీజేపీతో పోరాడాలని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో సమన్వయంగా పనిచేసేలా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జ్‌ని నియమించనున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments