KCR:తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ శుభవార్త .. ఆగస్ట్ 3 నుంచి రుణమాఫీ ప్రక్రియ షురూ..!!

  • IndiaGlitz, [Thursday,August 03 2023]

ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన.. తాజాగా అన్నదాతలకు ఊరట కలిగించే న్యూస్ చెప్పారు. రైతు రుణమాఫీని తిరిగి ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ 3 నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని సీఎం సూచించారు. అన్నదాతల సమస్యలు, రైతు రుణమాఫీపై బుధవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నోట్ల రద్దు , కరోనా వల్ల వచ్చిన ఆర్ధిక సమస్యలు, ఎఫ్ఆర్‌బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం కక్షపూరిత చర్యల కారణంగానే రైతు రుణమాఫీ కొంత ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు.

రైతు సంక్షేమానికి కట్టుబడి వున్నాం :

రైతు బీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఎన్ని కష్టాలు ఎదురైనా కొనసాగిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యచరణను విస్మరించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తామని.. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్ధికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించమన్నారు.

ఇంకా రూ.19 వేల కోట్ల రుణమాఫీ పెండింగ్ :

రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 19 వేల కోట్ల రూపాయాల రైతు రుణమాఫీని చేయాల్సి వుందని సీఎం వెల్లడించారు. రైతు బంధు తరహాలో విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ.. సెప్టెంబర్ రెండో వారం నాటికి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ఆర్ధిక మంత్రి హరీశ్ రావు, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావులు హాజరయ్యారు.

More News

Tarun:అసలు ఇలాంటి ఎలా పుట్టుకొస్తున్నాయో .. ఏమైనా వుంటే నేనే చెబుతా :  పెళ్లి పుకార్లకు చెక్‌పెట్టిన తరుణ్

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా వున్న హీరో హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు.

Jayasudha :బీజేపీలో చేరిన జయసుధ.. ఎన్నికల్లో పోటీ చేసేది సికింద్రాబాదా, ముషీరాబాదా : క్లారిటీ ఇచ్చిన సహజనటి

సీనియర్ నటి జయసుధ బీజేపీలో చేరారు. బుధవారం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో

Minister Ambati Rambabu:తగ్గేదే లేదు 'బ్రో' .. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్న అంబటి.. ఢిల్లీకి పయనం

సముద్రఖని దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయిథరమ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ‘బ్రో’.

Pawan Kalyan:తండ్రి లేని పిల్లాడని జగన్‌ని గెలిపించారు , కానీ ఈసారి అక్కడ గెలుపు మనదే: పవన్ కల్యాణ్

2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలిలో ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని ఆకాంక్షించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.

Pawan Kalyan:తెలుగు ఇండస్ట్రీ తలెత్తుకునేలా .. ఫిల్మ్ ఛాంబర్ పనిచేస్తుందనుకుంటున్నా : పవన్ కళ్యాణ్

ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు.