KCR : సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. ఏఐజీలో చికిత్స, హెల్త్ బులెటిన్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సిటీ స్కాన్, ఎండోస్కోపీ చేసిన వైద్యులు.. కేసీఆర్‌కు అల్సర్ వున్నట్లు తేల్చారు. దీంతో అల్సర్‌కు చికిత్స మొదలుపెట్టారు వైద్యులు. ఇదిలావుండగా కేసీఆర్ సతీమణి శోభారావు కూడా ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కూడా ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సీఎం దంపతుల వెంట కుమార్తె కవిత, ఇతర కుటుంబ సభ్యులు వున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు ఏఐజీ ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ దంపతుల ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు.
శనివారం అర్ధరాత్రి కేసీఆర్‌తో కవిత భేటీ:
అంతకుముందు శనివారం అర్ధరాత్రి దాటాక ప్రగతి భవన్లో తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. ఈడీ విచారణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, ఇతర విషయాలను ఆమె తన తండ్రికి వివరించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావులు కూడా పాల్గొన్నారు. ఈడీ తనను ఏ విధంగా ప్రశ్నించింది, తనతో ఎలా వ్యవహరించింది అన్న దానిపై కవిత సుదీర్ఘంగా వివరించారు. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాల్సి వుండటంతో కవితకు కేసీఆర్ పలు సూచనలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments