KCR : సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. ఏఐజీలో చికిత్స, హెల్త్ బులెటిన్ విడుదల

  • IndiaGlitz, [Monday,March 13 2023]

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సిటీ స్కాన్, ఎండోస్కోపీ చేసిన వైద్యులు.. కేసీఆర్‌కు అల్సర్ వున్నట్లు తేల్చారు. దీంతో అల్సర్‌కు చికిత్స మొదలుపెట్టారు వైద్యులు. ఇదిలావుండగా కేసీఆర్ సతీమణి శోభారావు కూడా ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కూడా ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సీఎం దంపతుల వెంట కుమార్తె కవిత, ఇతర కుటుంబ సభ్యులు వున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు ఏఐజీ ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ దంపతుల ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు.

శనివారం అర్ధరాత్రి కేసీఆర్‌తో కవిత భేటీ:

అంతకుముందు శనివారం అర్ధరాత్రి దాటాక ప్రగతి భవన్‌లో తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. ఈడీ విచారణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, ఇతర విషయాలను ఆమె తన తండ్రికి వివరించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావులు కూడా పాల్గొన్నారు. ఈడీ తనను ఏ విధంగా ప్రశ్నించింది, తనతో ఎలా వ్యవహరించింది అన్న దానిపై కవిత సుదీర్ఘంగా వివరించారు. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాల్సి వుండటంతో కవితకు కేసీఆర్ పలు సూచనలు చేశారు.
 

More News

Margadarshi:మార్గదర్శిలో నిబంధనల అతిక్రమణ.. రామోజీరావు, శైలజా కిరణ్‌లపై ఏపీ సీఐడీ కేసులు

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్‌లపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది.

Ram Charan:ప్రియాంక చోప్రా ఈవెంట్‌కు స‌తీమ‌ణి ఉపాస‌నతో క‌ల‌సి సంద‌డి చేసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్

ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు రామ్ చరణ్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌లు ఈవెంట్స్‌లోనూ ప్ర‌త్యేకంగా పాల్గొంటున్నారు.

Rajesh Touchriver:అర్థవంతమైన సినిమా కోసం ఉప‌యోగ‌క‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచించిన అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ రాజేష్ ట‌చ్ రివ‌ర్‌

డిఫ‌రెంట్ జోన‌ర్స్‌లో సినిమాల‌ను రూపొందించి నేష‌న‌ల్ అవార్డును పొందిన ద‌ర్శ‌కుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌.

Kalvakuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు.

Ex CM Kiran Kumar:బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలోనే కాంగ్రెస్‌కు గుడ్ బై, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ విభజనను చివరి వరకు వ్యతిరేకించి సొంతపార్టీపైనే పోరాటం చేశారు.