తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు బంద్..
- IndiaGlitz, [Tuesday,April 20 2021]
తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు బంద్ కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న క్రమంలో తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకూ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మూతపడనున్నాయి. కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలోనేడు కార్యదర్శి విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. ప్రేక్షకుల సంక్షేమం కోసమే తాము స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని విజేందర్‌రెడ్డి వెల్లడించారు.
అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు మాత్రం గుడ్ న్యూస్ వెల్లడించారు. థియేటర్ల మూసివేత నుంచి ‘వకీల్‌సాబ్’ సినిమాకు మాత్రం మినహాయింపునివ్వనున్నట్టు వెల్లడించారు. ‘వకీల్ సాబ్’ ఆడుతున్న సినిమా హాళ్లు మినహా అన్ని థియేటర్లు బుధవారం నుంచి మూతపడనున్నాయని వెల్లడించారు. అయితే ప్రభుత్వం కూడా థియేటర్ల విషయంపై ఓ జీవోని జారీ చేసింది.
ప్రభుత్వ జీవోలో ఉన్న ముఖ్యాంశాలు..
1. ఏప్రిల్ 20 నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ.. ఇది ఈ నెల 30వ తేదీ వరకు ఇలాగే కొనసాగుతుంది.
2. పై ఆర్డర్ ప్రకారం అనుమతులు ఉన్న థియేటర్లు (సింగిల్, మల్టీప్లెక్స్‌లతో సంబంధం లేకుండా) రాత్రి 8 గంటల లోపు మూసివేయాలి.