తెలంగాణ కాలజ్ఞాని ప్రొ. కొత్తపల్లి జయశంకర్ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంత తపన పడ్డారో అందరికి తెలిసిందే. 1969లో జరిగిన ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. కేసీఆర్‌గారు కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొంది అత్యంత సన్నిహితులయ్యారు. జయశంకర్‌సార్ చిన్న తనంలో జరిగిన విషయాలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఆ రోజుల్లోనే నిజాంకు సంబంధించిన గీతాన్ని పాడమని వేధిస్తే వందేమాతర గీతాన్ని మాత్రమే ఆలపిస్తానని నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తి జయశంకర్‌గారు. అలాంటి వ్యక్తిపై డాక్యుమెంటరీని రూపొందించడం ఆనందంగా వుంది. ఆయన జీవిత చరిత్రపై తెలంగాణ కాలజ్ఞాని ప్రొ.కొత్తపల్లి జయశంకర్ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సీడీని, టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా చేతుల మీదుగా విడుదలవుతున్న తొలిసీడీ కావడం నాకెంతో ఆనందంగా వుంది అన్నారు టీఎఫ్‌డీసీ ఛైర్మన్ పూస్కూర్ రామ్మోహన్‌రావు.
డెక్కన్ టాకీస్ సమర్పణలో తెలంగాణ కాలజ్ఞాని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ పేరుతో చేరణ్ ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ చిత్రానికి సంబంధించిన బిగ్ సీడీని శుక్రవారం హైదరాబాద్‌లో బీసీ కమీషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్ విడుదల చేయగా, సీడీని టీఎఫ్‌డీసీ ఛైర్మన్ పుస్కూర్ రామ్మోహన్‌రావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని వలస వాదులు కించపరుస్తున్నారని అలాంటి వారిని ఉపేక్షించకూడదని ఆ రోజుల్లోనే జయశంకర్‌గారు తీవ్రంగా స్పందించారు. తెలంగాణను ఇక్కడి వారే పరిపాలించాలని గట్టిగా వాదించారు. బెనారస్‌లో ఉన్నత చదువుతు చదివిన ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీని పూర్తి చేశారు. ఏ చిన్న సమస్య మొదలైనా దానిపై పోరాటం చేశారు. మన స్వయం పాలన ఎప్పుడు ఎలా వస్తుందా? అని అహర్నిశం తపించారాయన.
ఇవన్నీ డాక్యుమెంటరీలో దర్శకుడు చేరణ్ పొందుపరిచారు. జయశంకర్‌గారిని ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నారు. జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ఎఫ్‌డీసీ ఛైర్మన్ జయశంకర్‌సార్‌పై రూపొందిన సీడీని విడుదల చేయడం సంతోషంగా వుంది. ఐదవ తేదీన జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని అనివార్యకారణావల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ శుక్రవారం నిర్వహిస్తున్నది. టీచర్‌గా జయశంకర్‌గారు పనిచేశారు కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవం రోజున డాక్యుమెంటరీ సీడీని విడుదల చేయడం సంతోషకరమైన విషయం.
జయశంకర్ యావత్ తెలంగాణకు ఒక భావాజాలాన్ని అందించారు. ఆ భావజాల ఆయుధంతో ఉద్యమానికి, కేసీఆర్‌కు, ప్రజాసంఘాలకు ఒక తాత్విక భూమికను అందించిన వ్యక్తి జయశంకర్. ఆయనను స్మరించుకోవడం, ఆయన చరిత్రను తెలుసుకోవడం మన అందరికి ఎంతో అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి జయశంకర్ డాక్యుమెంటరీని రూపొందించిన దర్శకుడు చేరణ్ అభినందనీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు చేరణ్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout