Telangana Cabinet:రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..

  • IndiaGlitz, [Saturday,February 03 2024]

తెలంగాణ కేబినెట్ ఆదివారం భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల ముందు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గురించి ప్రధానంగా చర్చించనున్నారు. బడ్జెట్‌పై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చ జరపనున్నారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు, నిధుల కేటాయింపునకు సంబంధించిన వివరాలను ఆర్ధికశాఖ సేకరించింది. ఈ వివరాలను మంత్రివర్గానికి సమర్పించనుంది. ఆ నివేదికపై లోతుగా చర్చించి బడ్జెట్‌లో ఏయే శాఖలకు ఎన్ని నిధులు కేటాయించారనే అంశంపై సమాలోచనలు చేయనున్నారు.

ఇక అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి జరపాలి.. ఎన్ని రోజలు నిర్వహించాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఆరు గ్యారెంటీల హామీలపై చర్చించనున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంపు హామీలను అమలు చేస్తున్నారు. ఇక మిగిలిన వాటిలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ హామీల అమలుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నారు.

అలాగే ముఖ్యమైన ఈ హామీల కోసం దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? లబ్ధిదారుల సంఖ్య ఎంత? అనే వివరాలను తెలుసుకోనున్నారు. హామీల అమలుకు ఎన్ని నిధులను కేటాయించాలి? ఆ నిధులను ఎలా సమకూర్చుకోవాలనే విషయాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రక్షాళన చేసి, కొత్త పాలక మండలిని నియమించిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా చర్చలు జరపనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల ముందు జరగనున్న మంత్రివర్గం సమావేశం కావడంతో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

More News

Advani:నా సిద్ధాంతాలకు దక్కిన గౌరవం.. భారతరత్న పురస్కారంపై అద్వానీ..

కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపై ఎల్‌కే అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో వినయపూర్వకంగా ఈ అవార్డుని స్వీకరిస్తున్నానని తెలిపారు.

CM Jagan:యుద్ధానికి మీరు సిద్ధమా? చంద్రబాబును చంద్రముఖితో పోల్చిన సీఎం జగన్..

ఎల్లో వైరస్ మీద, కరోనా లాంటి దుష్టచతుష్టయం మీద యుద్ధానికి మీరు సిద్ధమా? మరో చారిత్రాత్మక విజయాన్ని అందించడానికి మీరు సిద్ధమా?

వైయస్ అంటే ఓ బ్రాండ్.. ఎవరు పడితే వారు వాడుకోవడం కుదరదు..

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొద్ది మంది నేతలు మాత్రమే తమదైన ముద్ర వేశారు. స్వర్గస్థులైనా ఇప్పటికీ వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. వారు చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ ఉంటారు.

Yatra 2:నేను విన్నాను.. నేను ఉన్నాను.. ట్రెండింగ్‌లో 'యాత్ర-2' ట్రైలర్..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

CP:తహసీల్దార్ రమణయ్య హత్య కేసు నిందితుడిని గుర్తించాం: సీపీ

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు నిందితుడిని గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్‌ రవిశంకర్‌ తెలిపారు.