KCR:కేసీఆర్ సంచలన నిర్ణయం.. తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం, 43 వేల కుటుంబాలకు లబ్ధి

  • IndiaGlitz, [Tuesday,August 01 2023]

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీంతో 43,373 మంది ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. వీరికి ఇకపై సర్కారే వేతనాలు చెల్లిస్తుంది. ఆర్టీసీ విలీనానికి సంబంధించి ప్రత్యేక కమిటీని కూడా నియమించారు. ఈ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు.

విలీనంపై ప్రత్యేక కమిటీ :

ఆర్టీసీని కాపాడేందుకు , ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు , సేవలను ఇంకా మెరుగుపరిచేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించామని మంత్రి కేటీఆర్ మీడియాకు వివరించారు. గతంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు గాను ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన.. ఆర్‌ అండ్ బీ, రవాణా శాఖ, జీఏడీ శాఖ కార్యదర్శులు, కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శిని సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.

కార్మికుల కల నెరవేరిందన్న పువ్వాడ :

మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికుల కల నెరవేరిందని ఆయన అన్నారు. కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని పువ్వాడ చెప్పారు. పెద్ద మనసుతో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ ఇచ్చిన వరమని.. రాష్ట్రవ్యాప్తంగా 43 వేల మంది కుటుంబాల్లో సీఎం వెలుగులు నింపారని అజయ్ కుమార్ కొనియాడారు. కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో చేర్చుకోవడం చిన్న విషయంకాదని, ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమని ప్రశంసించారు.

More News

MLC:గవర్నర్ కోటా ఎమ్మెల్సీ : కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లకు ఛాన్స్.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం

గవర్నర్ కోటాలో ఖాళీగా వున్న ఎమ్మెల్సీలుగా ఇద్దరికి అవకాశం కల్పించింది తెలంగాణ మంత్రిమండలి. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ,

Ex Minister Narayana:మాజీ మంత్రి నారాయణ మరదలి ఆరోపణలు : వీర మహిళకు పెద్ద కష్టం .. ఇలా వదిలేస్తారా పవన్ గారు

ఇస్త్రీ నలగని వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ.. తియ్యటి మాటలు చెబుతూ.. పెద్ద మనిషిలా కనిపించే ఎంతోమంది నిజస్వరూపం వేరే వుంటుంది.

TFCC: తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ .. ఎవరెవరికీ ఏ పదవులంటే..?

హోరాహోరీగా జరిగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

LGM:‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married)... ఆగ‌స్ట్ 4న భారీ విడుద‌ల‌

కుటుంబంలోని మ‌నుషులు అంద‌రూ ఒకేలా ఉండాల‌నేం లేదు.. ఒక్కొక్కరి మ‌న‌స్త‌త్వం ఒక్కోలా ఉంటుంది.

Chandramukhi 2:రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’ ఫస్ట్ లుక్ రిలీజ్.. వినాయ‌క చ‌వివితికి రిలీజ్

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’.