తెలంగాణ వార్షిక బడ్జెట్ ముఖ్యాంశాలు...

  • IndiaGlitz, [Monday,September 09 2019]

తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగిన మరుసటి రోజే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. సోమవారం ఉదయం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. అయితే ఆదివారం నాడే ఆర్థిక శాఖను తన్నీరు హరీశ్‌రావుకు కేటాయించినప్పటికీ.. కేసీఆర్ బడ్జెట్‌ను చదవి వినిపించడం గమనార్హం. అయితే ఈ వ్యవహారం వెనుక మతలబు ఏంటో కేసీఆర్‌-హరీశ్‌లకే తెలియాలి మరి. కాగా.. సుమారు 40 నిమిషాల పాటు కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని చదివి వినిపించారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన అనంతరం శాసనసభను ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించడం జరిగింది.

బడ్జెట్ లెక్కలివీ...!

2019-20గాను రూ. 1, 46,492.3 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు

మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు..

బడ్జెట్‌ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు

బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు

ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు కేటాయింపు

ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34వేల కుటుంబాలకు ప్రయోజనం
రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు మరింత పటిష్టమైన చర్యలు
శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాం
కొత్తగా ఏడు పోలీసు కమిషనరెట్లను ఏర్పాటుచేసి.. వాటి సంఖ్యను 9కి పెంచాం
పోలీసు సబ్‌ డివిజన్ల సంఖ్యను 163కి పెంచాం
పోలీసు సర్కిళ్ల సంఖ్యను 668 నుంచి 717కి పెంచాం
పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కి పెంచాం
అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం
పంచాయతీరాజ్‌ శాఖ బలోపేతానికి ఖాళీలను భర్తీ చేస్తాం
స్థానిక సంస్థలకు నిధుల కొరత రాకుండా కట్టుదిట్టమైన విధానం
గ్రామపంచాయతీలకు ప్రతినెలా రూ. 339 కోట్లు అందించాలని నిర్ణయం
ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు
ఆర్థిక మాంద్యం వల్ల ఆదాయం తగ్గింది
ఆదాయం తగ్గినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం
వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన
రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని అంచనా
బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం
పరిమితులకు లోబడి ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం ఖర్చు
నిధుల ఖర్చుపై మంత్రులు, కార్యదర్శులకు ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన సూచనలు
రైతుబంధు, రైతుబీమా పథకాలు నిరంతరం కొనసాగుతాయి
పంట రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నాం
రైతుబంధు కోసం 12వేల కోట్లు కేటాయింపు
రైతుబీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ.1,137కోట్లు కేటాయింపు
రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ కోసం ఇప్పటివరకు రూ. 20,925 కోట్లు ఖర్చు
ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమానికి 5.37 లక్షల కోట్ల ఖర్చు
ఉదయ్‌ పథకం ద్వారా రుణభారం రూ. 9,695 కోట్లు ప్రభుత్వమే భరిస్తుంది
విద్యుత్‌ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,772 కోట్లు
గ్రామపంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపు
పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు కేటాయింపు
కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ఉన్నతస్థాయి సేవలు
ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 ఓట్లు కేటాయింపు
అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు చేశాం
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ. 31,802 కోట్లు మాత్రమే
భీకరమైన జీవన విధ్వంసం నుంచి తెలంగాణ కుదుటపడింది
తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది
దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గింది
వాహనాల అమ్మకాలు 10.65శాతం తగ్గాయి
రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ ప్రభావం తెలంగాణపై కూడా పడింది
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారింది
2013-14లో జీఎస్‌డీపీ విలువ 4,51,581 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రెట్టింపయింది
గత ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం ఆరురెట్లు పెరిగింది
వందలాది గురుకులాల్లో లక్షలాది విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అందుతోంది
2014 జూన్‌లో నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది
దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది
2013-14లో జీఎస్‌డీపీ విలువ 4,51,581 కోట్లు

More News

సినీమహోత్సవంలో ‘జిల్ జిగేల్’ మనిపించిన పూజా!

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం ఆదివారం నాడు గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో

‘వాల్మీకి’లో వరుణ్ పేరేంటో తెలుసా..!?

మెగా హీరో వ‌రుణ్ తేజ్, పూజా హెగ్దే నటీనటులుగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది.

మెగాస్టార్ రాక‌.. ర‌కుల్ అల‌క‌

సినీ ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్స్ యూనియ‌న్ సిల్వ‌ర్ జూబ్లీ ఈవెంట్ ఆదివారం రాత్రి చాలా ఘ‌నంగా జ‌రిగింది.

శేఖర్ కమ్ముల - నాగ చైతన్య - సాయి పల్లవి సినిమా షూటింగ్ ప్రారంభం

ఫిదా సంచలన విజయం తర్వాత శేఖర్ కమ్ముల -నాగ చైతన్య- సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది.

తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం కార్యక్రమంలో