తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే...
Send us your feedback to audioarticles@vaarta.com
2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు సహజంగానే వ్యవసాయ రంగానికి, సాగునీటికి ఉన్నాయి. రెవెన్యూ మిగులు రూ. 6743.50 కోట్లు కాగా.. ఆర్థిక లోటు రూ. 45,509 కోట్లుగా హరీష్ రావు వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 30 వేల 825 కోట్లు
రెవెన్యూ వ్యయం లక్షా 69 వేల 383.44 కోట్లు
క్యాపిటల్ వ్యయం 29 వేల 46 కోట్లు
రెవెన్యూ మిగులు 6743.50 కోట్లు
ఆర్థిక లోటు 45,509 కోట్లు
కేటాయింపులు ఇలా:
ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులు
ఎమ్మెల్సీలకు 800 కోట్లు కేటాయింపు: హరీశ్‌రావు
నూతన సచివాలయ నిర్మాణానికి రూ.610 కోట్లు
రీజనల్ రింగ్‌రోడ్డు భూసేకరణకు రూ.750 కోట్లు
అటవీశాఖకు రూ.1276 కోట్లు
ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.29,271 కోట్లు
గత బడ్జెట్ కంటే 48 వేల కోట్లు అధికంగా కేటాయింపు
దేవాదాయశాఖకు రూ.720 కోట్లు
రైతుబంధుకు రూ.14,800 కోట్లు
రుణమాఫీకి రూ.5,225 కోట్లు
వ్యవసాయరంగానికి రూ.25వేల కోట్లు
పశుసంవర్థక, మత్స్యశాఖకు రూ.1730 కోట్లు
సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు
సమగ్ర భూసర్వే కోసం రూ.400 కోట్లు
రైతుభీమా పథకానికి రూ.1200 కోట్లు
వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.1500 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.11,728 కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.2,750 కోట్లు
సీఎం దళిత ఎంపవర్‌మెంట్ కోసం రూ.1000 కోట్లు
పల్లె ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు రూ.5761 కోట్లు
గీత కార్మికుల సంక్షేమానికి రూ.25 కోట్లు
గొల్ల కురుమలకు రూ.300 కోట్లతో 3 లక్షల యూనిట్ల గొర్రెలు
చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు
బీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
బీసీ సంక్షేమశాఖకు రూ.5,522 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి రూ.1600 కోట్లు
పోలీస్ స్టేషన్లలో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.20 కోట్లు
యూనివర్సిటీల్లో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.10 కోట్లు
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.3 వేల కోట్లు
మహిళ శిశు సంక్షేమం రూ.1702 కోట్లు
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రూ.11 వేల కోట్లు
పట్టణ ప్రగతి కోసం రూ.500 కోట్లు
వైకుంఠ దామాల నిర్మాణానికి రూ.200 కోట్లు
ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ.250 కోట్లు
సుంకిశాల తాగునీటి ప్రాజెక్ట్‌కు రూ.725 కోట్లు
మూసీ నది పునరుజ్జీవం కోసం రూ200 కోట్లు
మెట్రో రైలుకు రూ.1000 కోట్లు
ఓఆర్‌ఆర్ వెలుపలి కాలనీల తాగునీటి కోసం రూ.250 కోట్లు
వరంగల్ కార్పొరేషన్‌కు 250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్‌కు 150 కోట్లు
మున్సిపల్‌శాఖకు రూ.15,030 కోట్లు
వైద్య, ఆరోగ్యశాఖకు రూ.6,295 కోట్లు
పాఠశాల విద్య రూ.11,735 కోట్లు
ఉన్నత విద్య రూ.1,873 కోట్లు
విద్యారంగ ఉన్నతీకరణకు రూ.4 వేల కోట్లు
ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణకు రూ.2 వేల కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.3,077 కోట్లు
ఐటీ రంగానికి రూ.360 కోట్లు
రహదారులు, భవనాలశాఖకు రూ.8,788 కోట్లు
పంచాయతీరాజ్ రహదారులకు రూ.300 కోట్లు
పోలీస్ శాఖకు రూ.725 కోట్లు
రాష్ట్రంలో కొత్తగా 21 ఆర్వోబీ, ఆర్‌యూబీలకు రూ.400 కోట్లు
కొత్త ఎయిర్‌పోర్టుల కోసం రూ.100 కోట్లు
హోంశాఖకు రూ.6,465 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు
టూరిజం రూ.726 కోట్లు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com