తెలంగాణ వార్షిక బడ్జెట్ 2020-21.. కేటాయింపులు ఇవీ..
- IndiaGlitz, [Monday,March 09 2020]
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020-21ను ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాగా ఆర్థిక హోదాలో హరీశ్ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సాధించిన విజయాలు, కేటాయింపులు, చేపట్టాల్సిన పనులపై ఇలా అన్నింటిపై బడ్జెట్‌లో పొందుపర్చారు.
2020-21 బడ్జెట్ హైలైట్స్ ఇవీ...
తెలంగాణ ఆర్థిక 2020-21 బడ్జెట్: రూ. 1,82,914.42 కోట్లు
రెవెన్యూ వ్యయం - రూ. 1, 38, 669.82 కోట్లు
క్యాపిటల్ వ్యయం - రూ. 22,061.18 కోట్లు
రెవెన్యూ మిగులు - రూ. 4,482.12 కోట్లు
ఆర్థిక లోటు - రూ. 33,191.25 కోట్లు
కేటాయింపుల్లో దేనికెంత..!?
రైతు బంధుకు రూ. 14 వేల కోట్లు
రైతు బీమాకు రూ. రూ.1,141 కోట్లు
పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు
విద్యుత్ శాఖకు రూ.10,416 కోట్లు
వైద్య రంగానికి రూ.1,186 కోట్లు
రైతు రుణమాఫీకి రూ.1,119 కోట్లు.. రూ.25 వేల లోపు ఉన్న రైతు రుణాలు ఈ నెలలోనే మాఫీ
రైతు రుణ మాఫీ కోసం ఈ బడ్జెట్ లో రూ. 6225 కోట్లు కేటాయింపు
మార్కెట్ ఇంట్రవెన్షన్ ఫండ్‌కు రూ.వేయి కోట్లు
రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు
మైక్రో ఇరిగేషన్ కోసం రూ. 600 కోట్లు
పాడి రైతుల కోసం రూ. 100 కోట్లు
సాగు నీటి పారుదల రంగానికి రూ.11,054 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ. 11,758 కోట్లు.
ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 16,534.97 కోట్లు.
ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 9,771.27 కోట్లు
మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం రూ. 1,518.06 కోట్లు.
ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం రూ. 2,650 కోట్లు
పాఠశాల విద్యాశాఖకు రూ. 10,421 కోట్లు
ఉన్నత విద్యాశాఖకు రూ. 1,723.27 కోట్లు
సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ. 100 కోట్లు
వైద్య రంగానికి రూ. 6,186 కోట్లు
వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం రూ. 4,356.82 కోట్లు
పశు పోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు.
కల్యాణలక్ష్మి - బీసీల కోసం అదనపు నిధుల కింద రూ. 1,350 కోట్లు
ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు
మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 1,200 కోట్లు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కోసం రూ. 23,005 కోట్లు
పట్టణ మిషన్ భగీరథ పథకం కింద మిగిలిపోయిన 38 మున్సిపాలిటీలకు రూ. 800 కోట్లు
మున్సిపల్ శాఖకు రూ. 14,809 కోట్లు
హైదరాబాద్ నగరంలో ప్రాజెక్టుల అమలు కోసం రూ. 10 వేల కోట్లు
ఇండస్ట్రీయల్ ఇన్సెంటివ్స్ కోసం రూ. 1,500 కోట్లు
పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రూ. 1,998 కోట్లు
ఆర్టీసీకి రూ. 1000 కోట్లు
గృహ నిర్మాణాల కోసం రూ. 11,917 కోట్లు
పర్యావరణ, అటవీశాఖకు రూ. 791 కోట్లు
దేవాలయాల అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు
కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలను పూర్తి చేయడం కోసం రూ. 550 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ. 3,494 కోట్లు
పోలీసు శాఖకు రూ. 5,852 కోట్లు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్డీపీ నిధుల కోసం రూ. 480 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్రతిపాదనలు
సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ.100 కోట్లు
పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి రూ. 550 కోట్లు
శుభవార్తలు ఇవీ...
ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంపు
మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకంగా వీ-హబ్
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంప్లాయిస్ బోర్డు
సొంత స్థలం కలిగిన పేదలు ఇల్లు నిర్మించుకోడానికి ఆర్థికసాయం
వివిధ దశల్లో 2 లక్షల 72 వేల 763 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం
టీఎస్ ఐపాస్‌తో 12,427 పరిశ్రమలకు అనుమతి
టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి రూ.2 లక్షల 4 వేల కోట్ల పెట్టుబడులు
టీఎస్ ఐపాస్ ద్వారా 14 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి
టీఎస్ ప్రైమ్ పేరుతో మైనార్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం
వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి 71 మైనార్టీ జూనియర్ కాలేజీలు
ఇప్పటి వరకు 76 లక్షల 92 వేల 678 గొర్రెల పంపిణీ
మరో 70 లక్షల 88 వేల గొర్రె పిల్లల ఉత్పత్తి
గీత కార్మికులకు..
ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ. 6లక్షల పరిహారం
హరితహారంలో భాగంగా ఈత, తాటి వనాల పెంపకం
గీత కార్మికుల ఆదాయం పెంచేందుకు ప్రత్యేక పాలసీ
శీతల పానీయంగా నీరా అమ్మకం
గీత కార్మికుల చెట్టు పన్ను, పాత బాకీల రద్దు చేస్తామని మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.