మద్యం అమ్మకాల్లో ఆంధ్రా రికార్డ్ బద్ధలు కొట్టిన తెలంగాణ!

లాక్ డౌన్ 3.0 విధించిన అనంతరం కేంద్రం కొన్ని సడలింపులు చేసిన విషయం విదితమే. ఇందులో మద్యం అమ్మకాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ్మకాలు షురూ అయ్యాయి. ఏపీలో మొదటి రోజు 25 శాతం.. రెండో రోజు 50 శాతం ధరలు పెంచింది. అయినప్పటికీ మొదటి రోజు గంట గంటకూ క్యూ ఎక్కువ అవుతోందే తప్ప అస్సలు తగ్గలేదు. అయితే రెండో రోజు మాత్రం చాలా వరకూ క్యూలు తగ్గిపోయాయ్. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం వస్తుందా..? అనేది పక్కనెడితే సీఎం వైఎస్ జగన్ అనుకున్న మద్యపాన నిషేధానికి మాత్రం దీన్నొక సువర్ణావకాశం వాడుకున్నారు. దశల వారీగా అనుకుంటున్నారు కాబట్టి దీన్ని బట్టి చస్తే కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏపీలో మొదటి రోజు మాత్రం 67 కోట్ల రూపాయిలకు మద్యం అమ్మారు.

ఇక తెలంగాణ విషయానికొస్తే..

తెలంగాణలో బుధవారం 10 గంటల నుంచి మద్యం షాపులు తెరుచుకున్నాయి. మిగతా రాష్ట్రాల కంటే మరో అడుగు ముందుకేసిన కేసీఆర్.. గ్రీన్, ఆరెంజ్‌తో పాటు ఏకంగా రెడ్ జోన్లలో కూడా మద్యం షాపులు తెరుచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేకాదు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చీప్ లిక్కర్‌పై 11 శాతం.. ఇతర పెద్ద పెద్ద రేట్లున్న మద్యంపై 16 శాతం పెంచడం జరిగింది. దీంతో మద్యం బాబులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసేస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం 10 గంటలకు తెరుచుకున్న మద్యం షాపులు సాయంత్రం 6 గంటలకు మూసివేయబడ్డాయి. ఏ షాపు ముందు చూసినా మందు బాబులు కిక్కిరిసిపోయారు. భారీగానే మద్యం కొనుగోలు చేసేశారు.

రికార్డ్ బద్ధలు..!

అయితే తొలి రోజు అమ్మకాలు ముగియడంతో ఎంత మేర అమ్మకాలు జరిగాయన్న దానిపై లెక్కలు సాయంత్రం బయటకొచ్చాయి. బుధవారం ఒక్కరోజే రూ.90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. అంటే.. ఏపీలో కేవలం 67 కోట్లు అయితే.. తెలంగాణలో మాత్రం ఏకంగా 90 కోట్లు అంటే 13 కోట్లు వ్యత్యాసం అన్నమాట. ఏపీ రికార్డును తెలంగాణ బద్ధలు కొట్టేసిందన్న మాట. ఏపీలో ఆదాయం తగ్గడానికి.. తెలంగాణలో పెరగడానికి ఏకైక కారణం రేట్లు పెంచడమే. రానున్న రోజుల్లోనూ తెలంగాణ ఇలానే విక్రయాలు ఉంటాయి.. ఏపీలో మాత్రం రోజురోజుకు తగ్గిపోతాయ్.

క్యూ కట్టిన అమ్మాయిలు..

హైదరాబాద్‌లో పలు మద్యం షాపుల ఎదుట మహిళల క్యూ కట్టడంతో ఈ విచిత్రం చూసిన జనాలు ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకున్నారు. లాక్ డౌన్ తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దఎత్తున రోడ్లపైకి మహిళలు వచ్చేశారు. నగరంలోని ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్‌ సిటీలో మద్యం కోసం మహిళలు, అమ్మాయిల క్యూ కట్టడం గమనార్హం. ఐటీ సెక్టార్‌లోనూ పలు షాపుల దగ్గర భారీగా క్యూలు కట్టారు. దీన్ని బట్టి చూస్తే ఇన్ని రోజులు మందు దాహం తీర్చుకోవడానికి ఎంతగా వేచి చూశారో చెప్పుకోవచ్చు.

రేట్లు పెంచినప్పటికీ..

చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంపు ఉంటుందని మంగళవారం రాత్రి మీడియా మీట్‌లో కేసీఆర్ స్పష్టం చేశారు. దాని ప్రకారం రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ ధర రూ.760కి చేరింది. బ్రాండ్‌ను బట్టి పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. కింగ్ ఫిషర్ లైట్ బీరు రూ.150కి చేరింది. చిన్న బీరు రూ.100 అయ్యింది. బ్లాక్ డాగ్ (8ఇయర్స్) రూ.1930, టీచర్స్ రూ.1910, వ్యాట్ 69 రూ. 1770, బ్రెండర్స్ ప్రైడ్ రూ.1200 గా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రాండ్స్ చాలానే ఉన్నాయి.

More News

ఏపీ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లోని పాలనా యంత్రాంగంలో కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టూరు. ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకుని సీఎంగా

మ‌రోసారి పాక‌శాస్త్రంలో మోహ‌న్‌బాబు ప్రావీణ్య‌త‌

కరోనా ఎఫెక్ట్ వ‌ల్ల లాక్‌డౌన్‌ను విధించాయి ప్ర‌భుత్వాలు. దీంతో సినీ సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. షూటింగ్స్ అన్నీ ర‌ద్ద‌యిపోవ‌డంతో ఎప్పుడూ షూటింగ్స్,

నిన్న కేసీఆర్.. ఇవాళ హరీష్.. కేంద్రంపై యుద్ధం!?

కేంద్ర ప్రభుత్వంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నాయి. ఇప్పటికే మానిటోరియం, కేంద్రం చేతుల్లోకి కరెంట్, ఎఫ్ఆర్‌బీఎమ్‌, వలస కార్మికుల తరలింపుతో పాటు పలు విషయాల్లో కేంద్రం

టిక్‌టాక్‌లోకి విష్ణు ఎంట్రీ

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా గురించి తెలియ‌నివాడు లేదు. ప్ర‌తి మనిషి జీవితంలో సోష‌ల్ మీడియా ఏదో ర‌కంగా భాగ‌మైంది. ఇక సెల‌బ్రిటీల సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు.

'కిమ్ చనిపోవడం' అంతా డ్రామానే.. అసలు కారణాలివీ..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.