Telangana BJP:టార్గెట్ 10 ఎంపీ సీట్లు.. బస్సు యాత్రలకు తెలంగాణ బీజేపీ సిద్ధం..
Send us your feedback to audioarticles@vaarta.com
మరో రెండు నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 10 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 19 తేదీ వరకు ఈ యాత్రలు చేయనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలను నాలుగు క్లస్టర్లుగా విభజించారు. ఈ క్లస్టర్లలో ఒకేసారి యాత్రలు చేసేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఈ యాత్రలకు జాతీయ నాయకులు హాజరుకానున్నారు. దీంతో పార్టీ అగ్రనేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటించనున్నారు.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంతో దేశ వ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ వాతావరణాన్ని ఓట్ల రూపంలో మలిచేలా కార్యక్రమాల రూపకల్పన చేయనున్నారు. దీంతో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని భావిస్తున్నారు.కాగా గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో పాటు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నా కూడా బీజేపీ 4 ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఈసారి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఎలాగైనా 10 ఎంపీ స్థానాలు దక్కించుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీగా పుంజుకుంది. 2018 ఎన్నికల్లో 119 స్థానాలకు గాను కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచింది. అది కూడా గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ విజయం సాధించారు. అయితే 2023 ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని బలంగా నిలబడింది. అంతేకాకుండా ఓట్ల షేర్‌ను కూడా పెంచుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని డిసైడ్ అయింది. మూడో సారి కూడా మోదీ ప్రధాని అవ్వడం ఖాయమనే సర్వేల నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
ముఖ్యంగా మజ్లిస్ కంచుకోట అయిన హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి, కార్వాన్, బర్కత్‌పురా వంటి స్థానాల్లో మజ్లిస్ ఓటమి అంచుదాకా వెళ్లి తక్కువ మెజార్టీతో బయటపడింది. దీంతో హైదరాబాద్ ఎంపీ స్థానం గెలుచుకుని అక్బరుద్దీన్ ఒవైసీకి చెక్ పెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉండగా.. ఈ నేపథ్యంలో ఎలాగైనా జంట నగరాల్లో కాషాయ జెండా ఎగరేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout