థియేట‌ర్స్ కాల్చేస్తామంటూ హెచ్చ‌రిక‌...

  • IndiaGlitz, [Tuesday,November 07 2017]

బాలీవుడ్ మూవీ ప‌ద్మావ‌తికి ఇబ్బందులు ఉత్తరాదినే కాదు..ద‌క్షిణాది కూడా త‌ప్పేలా క‌న‌ప‌డ‌టం లేదు. వివ‌రాల్లోకెళ్తే..హైద‌రాబాద్ గోషా మ‌హ‌ల్‌కు చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్ సినిమా దర్శ‌కుడు సంజయ్ లీలా బ‌న్సాలీపై ఫైర్ అయ్యారు. సినిమాలో రాజ‌పుత్రుల‌ను అవ‌మాన ప‌రిచేలా స‌న్నివేశాలున్నాయ‌ని, రాజపుత్రుల గౌరవమర్యాదలకు సంబంధించిన అంశమన్నారు.

ఈ చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ రాజస్థాన్ రాజపుత్ర సమాజ్‌కు చెందిన ప్రతినిధులు రాజా సింగ్‌ను కలిసి కోరారు.దీంతో రాజా సింగ్ స్పందించారు. ఈ సినిమాను విడుద‌ల‌కు ముందు రాజ‌పుత్రుల‌కు చూపించాల‌ని కోరారు. అందులో అభ్యంత‌ర‌క‌ర‌మైన స‌న్నివేశాలుంటే తొల‌గించాల‌ని కోరారు.

త‌మ హెచ్చ‌రిక‌ల‌ను ఖాత‌రు చేయ‌కుండా ఇస‌నిమాను విడుద‌ల చేస్తే, థియేట‌ర్స్‌ను కాల్చివేస్తామ‌ని తెలిపారు. ప‌ద్మావ‌తి సినిమా డిసెంబ‌ర్ 1న విడుద‌ల‌కానుంది. ప‌ద్మావ‌తిగా దీపికాప‌దుకొనె న‌టిస్తుంటే, మ‌హారావ‌త్ సింగ్‌గా షాహిద్ క‌పూర్‌, అల్లావుద్దీన్ ఖిల్జీగా ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తున్నారు.