Former Bhadrachalam MLA:తెలంగాణ బీజేపీలో విషాదం.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

  • IndiaGlitz, [Monday,October 16 2023]

ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం అర్థరాత్రి ఒంటతి గంట సమయంలో ఆమెకు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుంగా మర్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్లల బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ కుటుంబసభ్యులకు తమ సంతాపం తెలియజేశారు. పేదలు, గిరిజనుల అభ్యున్నతికి సత్యవతి ఎంతో కృషి చేశారని వారు కొనియాడారు. ఆమె భౌతిక కాయానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నివాళులు అర్పించారు.

సీపీఎం ద్వారా రాజకీయ ప్రస్థానం..

కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులైన సత్యవతి సీపీఎం పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1991లో ఆ పార్టీ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్టీ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేశారు. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు.

More News

Bigg Boss 7 Telugu : మళ్లీ అమ్మాయే.. నయని పావని ఎలిమినేషన్, ఇంటి సభ్యులంతా కంటతడి .. ఎమోషనలైన నాగ్

బిగ్‌బాస్ సీజన్ 7లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురిని ఇంటిలోకి పంపించిని బిగ్‌బాస్..

YSRCP Social Media: లండన్‌లో ఘనంగా వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం..భారీగా హాజరైన కార్యకర్తలు

రాష్ట్రం సంక్షేమం కోసం సీఎం జగన్ అనుక్షణం ఎంతో కష్టపడుతున్నారని సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి తెలిపారు.

KCR:తెలంగాణ ప్రజలపై కేసీఆర్ వరాలు జల్లు.. రూ.400కే గ్యాస్ సిలిండర్.. పింఛన్ రూ.5వేలకు పెంపు

ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సబ్బండ వర్గాలే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించారు.

Telangana Congress:తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. పంతం నెగ్గించుకున్న మైనంపల్లి..

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది.

Chandrababu:జైల్లో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు

టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.