Telangana BJP: లోక్‌సభ ఎన్నికలపై టీబీజేపీ ప్రత్యేక కసరత్తు.. నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు ప్రకటన..

  • IndiaGlitz, [Monday,January 08 2024]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి తహతహలాడుతున్న కమలనాథులు అందుకు తగ్గట్లు కార్యాచరణతో ముందుకు పోతున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికలను ప్రిస్టేజ్‌గా తీసుకున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో పాగా వేసేందుకు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇంఛార్జ్‌లను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించారు.

రాష్ట్రంలో ఉన్న 17 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలవగా.. ఈసారి అంతకన్నా ఎక్కువ స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. కనీసం 10 స్థానాల్లో గెలిచేందుకు సిద్ధమైంది. అందుకే ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్‌లు వీరే..

అదిలాబాద్ – పాయక్ శంకర్ (ఎమ్మెల్యే)
పెద్దపల్లి – రామారావు పవార్ (ఎమ్మెల్యే)
కరీంనగర్ – ధనపాల్ సూర్యనారాయణ గుప్తా (ఎమ్మెల్యే)
నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి (ఎమ్మెల్యే)
జహీరాబాద్ – కాటేపల్లి వెంకటరమణ రెడ్డి (ఎమ్మెల్యే)
మెదక్ – పాల్వాయి హరీశ్ బాబు (ఎమ్మెల్యే)
మల్కాజిగిరి – పైడి రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్యే)
సికింద్రాబాద్ – కె. లక్ష్మణ్ (ఎంపీ)
హైదరాబాద్ – రాజాసింగ్ (ఎమ్మెల్యే)
చేవెళ్ల – ఏవీఎన్ రెడ్డి (ఎమ్మెల్సీ)
మహబూబ్ నగర్ – రామచంద్రరావు (మాజీ ఎమ్మెల్సీ)
నాగర్ కర్నూల్ – మాగం రంగారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)
నల్గొండ – చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి (మాజీ మంత్రి)
మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు (మాజీ ఎంపీ)
ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

More News

Bandla Ganesh: హరీష్‌రావు, కేటీఆర్‌లపై బండ్ల గణేశ్‌ తీవ్ర విమర్శలు

టాలీవుడ్ అగ్ర నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో గణేశ్ మాట్లాడుతూ

Devara:'దేవర' గ్లింప్స్ వచ్చేసిందిగా.. ఎన్టీఆర్ నటన అరాచకం అంతే..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర'. ఇప్పటికే విడుదలైన పోసర్లు సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయగా..

Bilkis Bano Case: గుజరాత్ సర్కార్‌కు షాక్.. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

బిల్కిస్ బానో(Bilkis Bano) కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 11 మంది నిందితులకు తిరిగి జైలు శిక్ష విధిస్తూ

బ్రేకింగ్: కార్పొరేటర్ పదవికి కేశినేని నాని కుమార్తె శ్వేత రాజీనామా

విజయవాడ రాజకీయాలు రోజురోజుకు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే బెజవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేశినేని నాని(Kesinenei Nani) ప్రకటించిన సంగతి తెలిసిందే.

Guntur Karaam: యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న 'గుంటూరు కారం' ట్రైలర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం'(Guntur Kaaram)చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో