ఇకపై పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు..

  • IndiaGlitz, [Sunday,December 20 2020]

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు తిరిగి పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఈ నెల 14 నుంచి కొనసాగుతున్న ప్రస్తుత విధానాన్ని నిలిపివేస్తున్నట్లు, 21 (సోమవారం)న తిరిగి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ గతంలో సొంతంగా తయారు చేయించుకున్న ‘కార్డ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్డ్‌మెంట్‌)’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నట్లు పేర్కొంది. దీంతో ఇకపై రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ల బుకింగ్‌ అనేది అవసరం లేదు.

కాగా.. తాజాగా హైకోర్టు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్‌ కార్డు కాలమ్‌ను తొలగించాలని, అప్పటివరకు స్లాట్ల బుకింగ్‌ను నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.కాగా.. కోర్టు నుంచి శుక్రవారం వరకూ ఆ ఆదేశాల తాలూకు కాపీ అందకపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ల బుకింగ్‌ కొనసాగింది. కాగా.. శుక్రవారం కాపీ అందడంతో హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం శనివారం నుంచి స్లాట్ల బుకింగ్‌ను నిలిపివేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు స్లాట్ల బుకింగ్‌ సదుపాయాన్ని కొంతకాలం పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (అబయెన్స్‌) సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు.

రిజిస్ట్రేషన్ల శాఖను సంప్రదించాల్సిన సంబర్లు..

కాగా.. ఈ నెల 19 వరకూ బుక్ అయిన స్లాట్ల రిజిస్ట్రేషన్లను మాత్రం చేపడుతున్నామని.. వాటి కోసం పేర్కొన్న తేదీలు, సమయాల్లో రిజస్ట్రేషన్లు జరుతాయని సీఎస్ వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఈ నెల 21 నుంచి ‘కార్డు’ సిస్టం ద్వారా రిజిస్ట్రేషన్లు చేపట్టాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని స్టాంపులు - రిజస్ట్రేషన్ల శాఖను ఆదేశించినట్టు సోమేష్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఏవైనా సందేహాలు తలెత్తితే స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖను సంప్రదించాలని, కాల్‌ సెంటర్‌ నంబర్‌ 18005994788 లోగానీ, వాట్సాప్‌ నంబర్‌ 9121220272 లోగానీ మెసేజ్‌లు పోస్ట్‌ చేయవచ్చని పేర్కొన్నారు.

More News

కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేయండి: ఏపీ ఆరోగ్యశాఖ

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం శరవేగంగా నిర్వహిస్తోంది.

47 నిమిషాలు గూగుల్ సేవలు నిలిచిపోవడానికి కారణం ఇదే..

గత సోమవారం గూగుల్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంలో ప్రపంచం మొత్తం షాక్ అయిన విషయం తెలిసిందే.

ఇండియన్ పనోరమకు ఎంపికైన ‘గతం’

అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించేందుకు చిత్రాల ఎంపిక పూర్తైంది.

పవన్ నెక్ట్స్ సినిమాకు ముహూర్తం కుదిరింది...!

రీ ఎంట్రీ త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఐదు సినిమాల‌కు ఓకే చెప్పారు. అందులో వ‌కీల్‌సాబ్ సెట్స్‌లో ఉంది.

నాని 26.. ప్రాఫిట‌బుల్ డీల్‌

2020లో నేచుర‌ల్ స్టార్ నాని త‌న 25వ చిత్రం ‘వి’తో ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. సినిమా డిజాస్ట‌ర్ టాక్‌ను సంపాదించుకుంది.