10th Class Results:తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. 19 కేంద్రాల్లో 9 రోజుల పాటు స్పాట్ వాల్యూయేషన్ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 మధ్య జరిగిన ఈ పరీక్షలకు సుమారు 5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.
బాలికలు 93.23 ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 8,883 మంది విద్యార్థులు 10కి 10 GPA సాధించడం విశేషం. ఈ ఫలితాలను bse.telangana.gov.inలో చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫలితాల్లో నిర్మల్ జిల్లా. 99.05శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా.. వికారాబాద్ జిల్లా 91.31 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 27వ స్థానంలో మేడ్చల్ జిల్లా.. 30వ స్థానంలో హైదరాబాద్ జిల్లా నిలవడం గమనార్హం. 3,927 స్కూల్స్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 6 ప్రైవేటు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.
మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మరోవైపు పదో తరగతి ఫలితాలతో విద్యార్ధులు ఒత్తిడికి గురి కావొద్దని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా సూచించారు. ఉత్తీర్ణత సాధించలేని వారికి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు. జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. అందులో బాగా రాసి పాస్ అవ్వొచ్చని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments