తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కారణంగా అల్లాడుతున్న జనానికి తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రజానీకానికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మే 1 నుంచి 18-45 ఏళ్ల లోపు వారందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మంది జనాభాకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 30 లక్షల మందికి ప్రభుత్వం వ్యాక్సిన్ అందించింది.
ఇక వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన జనాభా మొత్తానికి అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీని వల్ల ప్రభుత్వంపై రూ.2500 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనిపై సంబంధింత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నాటి నుంచే ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సైతం స్వయంగా పర్యవేక్షించనున్నారు. దీనికోసం జిల్లాల వారీగా ఇన్చార్జులను నియమించనున్నారు. తద్వారా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments