కె.యస్.రామారావుగారు, ప్రకాష్ రావుగారు 'కేటుగాడు' సినిమాని చూసి మెచ్చుకోవడం చాలా హ్యపీగా ఉంది - హీరో తేజస్

  • IndiaGlitz, [Saturday,August 15 2015]

ప్రముఖ రచయిత వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో యంగ్ హీరో తేజస్‌ కంచర్ల, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా వెంకటేష్‌ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం కేటుగాడు'. కిట్టు నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వెంకటేష్‌ బాలసాని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఆడియో మంచి సక్సెస్ సాధించింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్రయూనిట్ శనివారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో తేజస్, డైరెక్టర్ కిట్టు నల్లూరి, నిర్మాత వెంకటేష్ బలసాని, చిత్ర సమర్పకులు తెన్నేటి వి.ఎస్.పి., సినిమాటోగ్రాఫర్ జోషి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, పృథ్వీ, ప్రవీణ్, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా... నా ఫ్యామిలీ మెంబర్స్‌ తర్వాత నేను హీరోగా ఇక్కడ నిలబడటానికి కారణమైన కె.యస్.రామారావుగారు, ప్రకాష్ రాజ్ గారు ఇద్దరూ ఈ సినిమాని చూసి, చాలా బావుందని, చాలా బాగా నటించానని మెచ్చుకోవడం చాలా హ్యపీగా అనిపించింది. అంతే కాకుండా సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. సాయికార్తీక్ గారు అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. ఆడియో పెద్ద హిట్టయింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది.

వెంకటేష్ గారి లాంటి నిర్మాత వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఉలవచారు బిర్యాని తర్వాతే నేను హీరోగా చేసిన ఈ సినిమా విడుదలవుతుంటే చాలా ఎగ్జయిట్ గా ఉంది. సినిమాని వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని హీరో తేజస్ అన్నారు. సాయికార్తీక్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి పాటను డిఫరెంట్‌గా ఇచ్చారు. జోషిగారి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్‌ అవుతుంది. ఒక మంచి సినిమాని రూపొందించాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. సినిమా సెన్సార్ కూడా పూర్తయిపోయింది. వచ్చే నెలలో సినిమాని మీ ముందుకు తీసుకువస్తాం. సినిమాని పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నామని నిర్మాత వెంకటేష్ బలసాని అన్నారు. నన్ను అందరూ ముఠామేస్త్రి అని, బాగా కష్టపెడతానని అనుకుని ఉంటారు. అయితే ఎంత కష్టపెట్టినా సినిమా క్వాలిటీగా రావడానికే. సాయికార్తీక్ గారు సినిమాని తన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరో లెవల్ లో నిలబెట్టారు.

తేజస్, చాందని సహా అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమాని విడుదలకు సిద్ధం చేశాం. వచ్చే నెలలో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు కిట్టు నల్లూరి అన్నారు.

దర్శకుడు కిట్టు, హీరో తేజస్ తో మంచి అనుబంధం ఉంది. నా స్వంత సినిమాలా భావించి పనిచేశాను. నిర్మాత వెంకటేష్ గారు సినిమాని ప్రొడక్షన్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తోనే సినిమాని అనుకున్న సమయంలో మంచి క్వాలిటీతో పూర్తి చేయగలిగామని, ఆడియో హిట్ చేసిన విధంగానే సినిమాని పెద్ద హిట్ చేయాలని సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అన్నారు.మంచి కథ, యూత్ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. దర్శకుడు కిట్టు, నిర్మాత వెంకటేష్ బలసాని ఒక మంచి క్వాలిటీ మూవీని అందిస్తే, హీరో తేజస్ పది, పదిహేను సినిమాల అనుభమున్న హీరోలా నటించాడు. సినిమా బాగా వచ్చింది. వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చిత్ర సమర్పకులు వి.ఎస్.పి.తెన్నేటి అన్నారు.

యూనిట్ సభ్యులు ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.

More News

Kangna's TWMR, Salman's 'Bajrangi Bhaijaan' and now Mahesh Babu's 'Srimanthudu' - Eros scores a hat-trick of Blockbusters in 100 days

It is 'achche din' indeed for Eros. It is dealing with Blockbusters no less with first 'Tanu Weds Manu Returns' and then 'Bajrangi Bhaijaan' turning out to be All Time Blockbusters. Now it has delivered yet another biggie in a space of 100 days, what with their Telugu outing Srimanthudu taking the biggest opening down South after 'Baahubali'. With over 100 crore coming in just one week, the Mahesh

'Poster Boyz' Independence day poster

Independence day special poster of Poster Boyz, produced by Akshay Kumar and Rana Daggubati, is here.

'Kanche' trailer review

Breathtaking visuals, soul-stirring music and amazing dialogues. This is what 'Kanche' teaser all about.

Inaamulhaq's short film 'Ab Rab Havale' releases on YouTube

Inaamulhaq who was last seen playing a Pakistani in Nitin Kakkar’s 'Filmistaan' had shot for a short film ‘Ab Rab Havale’ directed by Ritika Bajaj Vijra and produced by Creative Canvas Entertainment. The film that was nominated in film festivals like Dada Saheb Phalke Film Festival, Los Angeles Independent Film Festival Awards (LAIFFA), The Cannes Short Film Corner, 2015 and Indie Fest USA has now

Sushant Singh hits Tendulkar junior for a six

Sushant Singh who is currently occupied with the prep of his next outing MS Dhoni recently was practicing cricket at a stadium in Mumbai.