'మీ టూ' వ్యవహారంపై తేజస్వి వెబ్‌సిరీస్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచం యావత్తు మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుదలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రారంభమైన ఉద్యమం `మీ టూ`. హాలీవుడ్ నుండి ప్రారంభమైన ఈ ఉద్యమంతో సినిమా రంగం సహా పలు రంగాల్లోని ప్రముఖులు చేసిన లైంగిక దాడులు బయటకు వచ్చాయి. తాజాగా దక్షిణాది అది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తేజస్వి మడివాడ మీ టూ వ్యవహారాలపై ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందింస్తున్నారు. హైదరాబాద్ నవాబ్స్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా ఈ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. నాలుగు ఎపిసోడ్స్‌గా రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్‌లో ఓ ఎపిసోడ్లో తేజస్వి మడివాడ నటిస్తున్నారు.
నటిగా ఎదగాలనుకుంటున్న ఎంతో మంది అమ్మాయిలు సినీ రంగంలోకి వస్తే వారు లైంగికంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారనే దానిపై రూపొందనున్న వెబ్‌సిరీస్ గురించి తేజస్వి మడివాడ ధైర్యంగా మాట్లాడింది. బోల్డ్‌గా, రా కంటెంట్‌తో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని, ఓ నటిగా స్క్రిప్ట్ డిమాండ్ మేరకు బోల్డ్ సీన్స్‌లో నటిస్తున్నానని తేజస్వి చెప్పింది. నేను కూడా హీరోయిన్గా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాను. వాటిని కూడా ఈ వెబ్‌సిరీస్‌లో చూడొచ్చు అని అన్నారు తేజస్వి. మరి ఈ వెబ్‌సిరీస్ ద్వారా ఇండస్ట్రీకి చెందిన వారి పేర్లేమైనా బయటకు వస్తాయేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments