కాస్టింగ్ కౌచ్‌పై తేజస్వి సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్, హీరోయిన్ స్నేహితురాలిగా పలు సినిమాల్లో నటించిన తేజస్విని మడివాడ రీసెంట్గా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై బాంబు పేల్చింది. తనను చాలా మంది కమిట్మెంట్ అడిగారని ఆమె చెప్పింది. ‘‘సినిమా ఇండస్ట్రీలో అసలు మనుషులను చేరుకోవాలంటే చాలా సమస్యలను దాటి వెళ్లాలి. 90 శాతం కాస్టింగ్ కౌచ్‌ను దాటిన తర్వాతే మన టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే మనుషులుంటారు. నేను కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో నన్ను వారి పడకగదికి రమ్మని పిలిచినవారు చాలా మందే ఉన్నారు. ఓ సందర్భంలో ఇండస్ట్రీ వదలి బయటకు వచ్చేయాలని కూడా అనుకున్నాను. నేను ధైర్యంగా మాట్లాడుతాను కాబట్టి నాతో ఎవరూ ఇలాంటి వ్యవహారాల్లో చొరవ చూపించడానికి ధైర్యం చేయలేకపోయేవారు.
ముంబై నుండి వచ్చే హీరోయిన్స్ ఇలాంటి వ్యవహారాలుంటాయనే మానసికంగా సన్నద్ధమయ్యే వస్తారు. మన దక్షిణాది అమ్మాయిలకు ఈ విషయాలు తెలుసు. అయితే మనం ఎంత మేరకు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యున్నామనేదే ముఖ్యం. కమిట్మెంట్కు రెడీ అంటే చాలా అవకాశాలే వస్తాయి’’ అని ఓ ఇంటర్వ్యూలో తేజస్వి తెలియజేసింది. అంతే కాకుండా కాస్టింగ్ కౌచ్ వల్లనే తాను రిలేషన్ షిప్లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిని వదులుకున్నానని కూడా తెలియజేసింది తేజస్విని.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments