18న తేజస్ 'కేటుగాడు'
Send us your feedback to audioarticles@vaarta.com
ఉలవచారు బిర్యాని` చిత్రంలో హీరోగా తెరంగేట్రం చేసిన తేజస్ ఇప్పుడు కేటుగాడు`గా మనకు ముందుకు వస్తున్నాడు. లవ్ విత్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో తేజస్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ రచయిత వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో యంగ్ హీరో తేజస్ కంచర్ల, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా వెంకటేష్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం కేటుగాడు`. కిట్టు నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వెంకటేష్ బాలసాని నిర్మించారు.
సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అన్నీ ఎలిమెంట్స్ పక్కాగా కుదిరాయని, తేజస్, యాక్టింగ్, చాందిని చౌదరి గ్లామర్ సినిమాకి ప్లస్ అవుతున్నాయని కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని ఈ చిత్రంతో తేజస్ మంచి బ్రేక్ సాధిస్తాడని యూనిట్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఇటీవల ఈ చిత్రం ప్రివ్యూ చూసిన ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని, తేజస్ సహా మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ కి మంచి పేరు వస్తుందని తెలియజేశారు. ప్రివ్యూకి పాజిటివ్ టాక్ రావడంతో యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
థియేట్రికల్ ట్రైలర్, సాయికార్తీక్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం నిర్మాత బలసాని వెంకటేష్ చిత్రాన్నిగ్రాండ్ లెవల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ఫుల్ పాజిటివ్ బజ్ తో సెప్టెంబర్ 18న థియేటర్స్ లో సందడి చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com