మెగా హీరోతో తేజ...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న తేజ చాలా కాలం తర్వాత హిట్ మూవీని తెరెక్కించలేకపోయాడు. దాదాపు దశాబ్దకాలం తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రితో తేజ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించాడు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటించాడు. ఓ సినీ వారసుడితో హిట్ అందుకున్న తేజ ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌తేజ్‌తో ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.
తేజ కథ, కథనం తయారు చేసుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈలోపు వరుణ్‌తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసేస్తాడు. తరువాతే తేజ, వరుణ్‌తేజ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ అందుకున్న తేజ ఈసారి కొత్తవాళ్లను కాకుండా ఇండస్ట్రీ వారసత్వ హీరోలను నమ్ముకున్నట్లే కనిపిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com