నితిన్ నిర్ణయం కోసం తేజ వెయిటింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నితిన్ నిర్ణయం కోసం తేజ వెయిటింగ్..అంటే ఇదేదో నితిన్ కి తేజ కథ చెప్పాడేమో...అందుకే నితిన్ నిర్ణయం కోసం వెయిటింగ్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అసలు విషయం ఏమిటంటే...తేజ నూతన నటీనటులతో హోరా హోరి మూవీ తెరకెక్కించాడు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని రంజిత్ మూవీస్ పతాకంపై దామెదర ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇంతలో నితిన్ కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాన్ని కూడా ఈ నెల 11న రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు చిత్రాలు ఒకేరోజు రిలీజ్ అయితే కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుంది కనుక నితిన్, తేజ ఇద్దరు ఆలోచనలో పడ్డారట. అందుకనే నితిన్ కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాన్ని ఈ నెల 11న రిలీజ్ చేస్తే...తేజ హోరా హోరి చిత్రాన్ని 18న రిలీజ్ చేస్తారట. కొరియర్ బాయ్ కళ్యాణ్ 18న రిలీజ్ చేస్తామంటే హోరా హోరి 11న రిలీజ్ చేస్తారట. ఏది ఏమైనా నితిన్ నిర్ణయం పైనే హోరా హోరి రిలీజ్ ఆధారపడింది. అది అసలు సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout