మల్టీస్టారర్ ఆలోచనలో తేజ
- IndiaGlitz, [Saturday,July 06 2019]
ఈ ఏడాది 'సీత' చిత్రంతో తేజ ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆదరణ పొందలేదు. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్స్‌గా నటించారు. జయాపజయాలను పక్కన పెట్టి ఈ సీనియర్ దర్శకుడు తన తదుపరి సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించడానికి ఈ సీనియర్ దర్శకుడు స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నాడట. అయితే స్క్రిప్ట్ రాయడం తొలి దశలోనే ఉంది.. కాబట్టి ఇప్పుడే సినిమా గురించి చెప్పలేను అని ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ చెప్పారు. ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లోనే సినిమా సాగుతుందట.