'హోరా హోరీ' గా ఫైట్ కి సిద్ధమవుతోన్న తేజ

  • IndiaGlitz, [Tuesday,August 25 2015]

'అలా మొదలైంది', అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా, 'చిత్రం, నువ్వు నేను', జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హోరా హోరీ'. దిలీప్,దక్ష హీరో హీరోయిన్లుగా నటించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలచేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ అధిపతి డి.సురేష్ బాబు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. గతంలో తనదైన శైళి ప్రేమకథలతో పెద్ద విజయాలను అందుకున్న తేజ ఈ సారి హోరాహీరీతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడో మరి చూద్దాం.

దిలీప్, దక్ష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కళ్యాణ్: పాటలు: పెద్దాడ మూర్తి: రచనా సహకారం: ఆకెళ్ళ శివప్రసాద్, బాలకుమారన్, కెమెరా: దీపక్ భగవంత్; ఎడిటర్: జునైద్; కాస్ట్యూమ్ డిజైనర్; శ్రీ; స్టంట్స్: పాంథర్ నాగరాజు: నృత్యాలు: శంకర్, కెవిన్; సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి. వి ; నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్; కధ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: తేజ.

More News

సూర్య తాజా చిత్రం హక్కులు సొంతం చేసుకొన్న 'సాయిమణికంఠ క్రియేషన్స్‌'

తమిళంలోనే కాదు.. తెలుగులోనూ తిరుగులేని స్టార్‌డమ్‌ కలిగిన కథానాయకుడు సూర్య. ‘గజిని, యముడు, సింగం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న వెర్సటైల్‌ సూపర్‌స్టార్‌ అతను.

'డిక్టేటర్' తొలి షెడ్యూల్ పూర్తి

సినిమా నిర్మాణ రంగంలో అతి పెద్ద నిర్మాణ సంస్థగా పేరు పొందిన ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో రూపొందుతోన్న నటసింహ నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయింది.

సూర్య టైటిల్ మారుతుంది

తమిళ స్టార్ సూర్య హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు.

'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' నా మనసుకి దగ్గరైన సినిమా - హీరో నితిన్

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవమీనన్‌ సమర్పణలో గురు ఫిలింస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అసోసియేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’.

పవన్ ఓకే చెప్పాడట...

చిన్న, పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన ఈ తరం నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. శిరీష్, లక్ష్మణ్ ల సహకారంతో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు