మహేష్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తేజ
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రంలో హర్ష పాత్రలో నటించిన మహేష్ ఓ ఊరు దత్తత తీసుకుని ఆ ఊరు రూపురేఖలే మార్చేస్తాడు. ఈ పాత్ర బాగా ఇన్ స్పైయిర్ చేసినట్టుంది..రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా చేసి చూపించాడు మహేష్. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రెండు ప్రాంతంలో ఊరును దత్తత తీసుకున్నాడు. మహేష్ తర్వాత శ్రుతి హాసన్, ప్రకాష్ రాజ్ కూడా ఊరును దత్తత తీసుకున్నారు.
ఇంతకీ మహేష్ పై తేజ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఏమిటంటే... శ్రీమంతుడు సినిమా ప్రభావం వలన అనుకుంట మహేష్, శ్రుతిహాసన్, ప్రకాష్ రాజ్ ఊరును దత్తత తీసుకున్నారు అంటే... జనాలపై సినిమాల ప్రభావం అసలు ఉండదు. అయినా మహేష్ ఊరును దత్తత తీసుకుంది ఏదో సమాజ సేవ చేయడం కోసం కాదు. ఇన్ కంటాక్స్ లో రాయితీ కోసం. ఆయన సమాజ సేవ చేయాలనుకుంటే ఒక్కడు హిట్ అయినప్పడే చేయచ్చు కదా...ఇప్పుడు చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. అసలు తేజ చేసిన కామెంట్ నిజం అంటారా..? కాదంటారా..? మరి...తేజ వ్యాఖ్యలపై మహేష్ స్పందిస్తాడో..? లేక మహేష్ ఫ్యాన్స్ స్పందిస్తారో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com