కలెక్షన్ల సునామీ సృష్టించిన 'హనుమాన్'.. టాప్-5 సినిమాల్లో చోటు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన'హనుమాన్'చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హనుమంతుడిని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఈ చిత్రానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ జై హనుమాన్ అంటున్నారు. మూవీలోని వీఎఫ్‌క్స్, గ్రాఫిక్స్‌కు సలాం చేస్తున్నారు. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. తెలుగుతో పాటు హిందో మార్కెట్‌లోనూ దుమ్మురేపుతోంది. హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు నిండిపోతున్నాయి. తాజాగా మూవీ రిలీజై పది రోజులు పూర్తి కావడంతో సినిమా వసూళ్లను మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
తొలి రోజే ప్రపంవ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక మూడు రోజుల్లోనే రూ.60కోట్ల రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక వారం రోజుల్లోనే 150 కోట్ల రూపాలయు కలెక్ట్ చేయగా.. పది రోజుల్లోనే రూ.200కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. రూ.150కోట్ల నుంచి రూ.200 కోట్ల మార్క్‌ని అందుకోవడానికి కేవలం మూడు రోజులు సమయం మాత్రమే పట్టడం గమనార్హం. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక అమెరికాలో కూడా ఈ చిత్రం సంచలనాలు నమోదుచేస్తోంది.
తాజాగా నాలుగు మిలియన్ డాలర్స్ క్లబ్‌లోకి చేరింది. దీంతో అల్లు అర్జున్ ‘అలవైకుంఠపురంలో’, రామ్ చరణ్ ‘రంగస్థలం’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, ప్రభాస్ ‘సాహో’, ‘ఆదిపురుష్’ సినిమాల రికార్డును బ్రేక్ చేసింది. ఈ సినిమాలు 3 మిలియన డాలర్స్‌పైగా వసూళ్లు చేశాయి. ప్రస్తుతం నాలుగు మిలియన్ డాలర్లతో 'హనుమాన్' టాప్ 5లో నిలిచింది. తొలి నాలుగు స్థానాల్లో బాహుబలి2 (20M), ఆర్ఆర్ఆర్(14.3M), సలార్(8.9M), బాహుబలి (8M) ఉన్నాయి. ప్రస్తుతం సినిమా ఊపు చూస్తుంటే త్వరలోనే బాహుబలి రికార్డును బ్రేక్ చేసేలా ఉంది.
తొలుత ఈ మూవీ కోసం దాదాపు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకోగా.. టీజర్‌కు వచ్చిన స్పందనతో గ్రాఫిక్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. దీంతో బడ్జెట్ రూ.20-30 కోట్లకు చేరింది. అయినా కానీ చిన్న బడ్జెట్‌తోనే విజువల్ వండర్‌గా మూవీని తీశారు. చివరి 15 నిమిషాలు అయితే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్, సముద్రఖని, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com