Hanuman in USA: అమెరికాలో 'గుంటూరుకారం' కుర్చీ మడతపెట్టిన 'హనుమాన్'..

  • IndiaGlitz, [Saturday,January 13 2024]

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది సంక్రాంతికి తెలుగు సినిమా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈసారి ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలతో ఓ చిన్న హీరో పోటీ పడటం విశేషం. తొలిరోజు అంటే జనవరి 12న సూపర్ స్టార్ మహేశ్‌ బాబు నటించిన 'గుంటూరు కారం', తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' చిత్రాలు విడుదలయ్యాయి. మహేష్‌ లాంటి స్టార్ హీరో చిత్రం కావడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎక్కువ దక్కాయి. అయితే 'హనుమాన్' చిత్రంపై భారీ హోప్స్ ఉన్నా చిన్న సినిమా కావడంతో తక్కువ థియేటర్లు మాత్రమే దొరికాయి.

కానీ రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాక మహేష్‌ మూవీకి మిక్స్‌డ్ టాక్ రాగా.. హనుమాన్ చిత్రానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇటు నార్త్ నుంచి సౌత్ వరకు ఆల్ ఓవర్ బ్లాక్‌బాస్టర్ టాక్ అందుకుంది. అటు విదేశాల్లో కూడా దుమ్మురేపుతోంది. అయితే తెలుగులో తక్కువ థియేటర్లు దొరకడంతో ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడింది. దీంతో ప్రస్తుతానికి ఇక్కడ మహేష్‌నే పైచేయి సాధించాడు. కానీ అమెరికాలో మాత్రం తేజ సజ్జా ఇరగదీస్తున్నాడు.

హనుమాన్ సినిమా యూఎస్‌లో ప్రీమియర్ షోల ద్వారా 4లక్షల 60వేల డాలర్లు వసూళ్లు సాధించగా.. రిలీజ్ రోజు మాత్రం అందుకు రెండింతలు వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా రోజున్నరలోనే ఏకంగా 1మిలియన్ డాలర్స్‌ క్లబ్‌లోకి చేరింది. ఇక మహేష్ 'గుంటూరు కారం' సినిమా ప్రీమియర్ షోల ద్వారా 1.39 మిలయన్ డాలర్స్ రాబట్టగా.. రిలీజ్ రోజు మాత్రం ఘోరంగా కేవలం 3లక్షల 80వేల డాలర్స్ మాత్రమే వసూలు చేసి రేస్‌లో దారుణంగా వెనకబడింది.

త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్, మహేష్ స్టార్ హీరో ఉన్నా కూడా గుంటూరుకారం సినిమాలో కథ లేకపోవడం, లాజిక్ లెస్ సీన్స్ ఉండటంతో ఇక్కడి ఆడియన్స్‌తో పాటు ఓవర్సీస్ ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. అమెరికాలో అయితే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందని ప్రీమియర్ షోల కంటే తొలి రోజు వచ్చిన వసూళ్లను చూస్తే అర్థమవుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపు సగానికి పైగా వసూళ్లు పడిపోయాయంటే సినిమా అక్కడి అభిమానులను ఎంతగా నిరాశపరిచిందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు.

అదే ప్రశాంత్ వర్మ లాంటి చిన్న డైరెక్టర్, తేజ సజ్జా లాంటి చిన్న హీరో కాంబోలో వచ్చిన హనుమాన్ మూవీకి మాత్రం బ్రహ్మారథం పడుతున్నారని చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, ఎక్స్‌ట్రాడనరీ వీఎఫ్‌క్స్, రోమాలు నిక్కబొడిచే బీజీఎం.. ఇలా ప్రతిది అభిమానులను కట్టిపడేసిందంటున్నారు. దీంతో సినిమాకు ప్రీమియర్ షోల కంటే తొలి రోజు సగానికి పైగా కలెక్షన్స్ పెరిగాయి. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే 2 మిలియన్ డాలర్స్ క్లబ్‌లోకి చేరడం పక్కా అంటున్నారు.

కాగా ఇప్పటివరకు ఈ క్లబ్‌లో మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్‌ హీరోలు మాత్రమే చోటు దక్కించుకున్నారు. తాజాగా హనుమాన్ మూవీతో ఈ లిస్టులోకి తేజ సజ్జ కూడా ఎంటరై రికార్డ్ సృష్టించాడు. మొత్తానికి అమెరికాలో మహేష్‌, త్రివిక్రమ్‌లను ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జా వెనక్కి నెట్టేసి తెలుగు సినిమా స్థాయిని గర్వంగా నిలబెట్టారు.

More News

MP Balasouri: వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీకి బందర్ ఎంపీ బాలశౌరి రాజీనామా..

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీకి అసలు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించే నేతలంతా పార్టీకి రాజీనామాలు చేయడం

తెలుగుదేశం పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన అంగన్‌వాడీలు

కొద్ది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వారి డిమాండ్స్ పట్ల సానుకూలంగా ఉంది.

Chandrababu: సీఐడీ కార్యాలయాలకు వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ ఎందుకంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా విజయవాడ తులసీనగర్‌లో ఉన్న సీఐడీ కార్యాలయానికి వెళ్లారు.

Pandem Kollu: కాలు దువ్వుతున్న పందెంకోళ్లు.. చేతులు మారనున్న కోట్ల రూపాయలు..

సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు, ముగ్గులు, గొబెమ్మలు. ఇవే కాకుండా ముందుగా వినపడేది కోడిపందాలు.

First Day Collections: 'గుంటూరుకారం' వర్సెస్ 'హనుమాన్'.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం'బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మహేష్ వన్ మ్యాన్‌ షోతో అలరిస్తున్నాడు.