తప్పుకున్న తేజ
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం `యన్.టి.ఆర్`. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తేజ దర్శకత్వంలో సినిమా తెరకెక్కాల్సింది. కానీ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే సినిమా నుండి తాను తప్పుకుంటున్నట్లు దర్శకుడు తేజ తెలిపారు. `నేను ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానిని. ఆయన జీవిత చరిత్రను నేను తీయలేమోననిపించింది.
అందుకనే తప్పుకుంటున్నా` అని తెలిపారు. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్న తరుణంలో తేజ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. మరిప్పుడు `యన్.టి.ఆర్` బయోపిక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com