సెన్సేషనల్ పాయింట్ మీద తేజ సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ డైరెక్టర్ తేజ ఒకప్పుడు చిత్రం, నువ్వు నేను, జయం వంటి ప్రేమకథా చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నాడు. లవ్‌స్టోరీస్‌ను తెరకెక్కించడంలో దిట్టగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత సక్సెస్‌లను సాధించడంలో వెనుకబడ్డాడు. ఇక తేజ అనే డైరెక్టర్ లేడేమో అని అనుకుంటున్న సమయంలో `నేనే రాజు నేనే మంత్రి` సినిమాతో సక్సెస్ సాధించి మళ్లీ తన ఉనికిని చాటుకున్నాడు.
సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్`ను తెరకెక్కించాల్సింది కానీ.. ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. కానీ తర్వాత తేజ తెరకెక్కించిన `సీత` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈయన తదుపరి సినిమాలపై పలు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో తాజాగా ఈయనొక బాలీవుడ్ సినిమాలో పని చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సమాచారం మేరకు తేజ ఇటీవల కాశ్మీర్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఎత్తేసిన 370 ఆర్టికల్‌కు సంబంధించి ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే సినిమాకు సంబధించిన ప్రకటన వస్తుందని టాక్. బాలీవుడ్‌కి సంబంధించిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments