సెన్సేష‌న‌ల్ పాయింట్ మీద తేజ సినిమా

  • IndiaGlitz, [Wednesday,November 27 2019]

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ ఒక‌ప్పుడు చిత్రం, నువ్వు నేను, జ‌యం వంటి ప్రేమ‌క‌థా చిత్రాల‌తో వ‌రుస విజయాల‌ను అందుకున్నాడు. ల‌వ్‌స్టోరీస్‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట‌గా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ త‌ర్వాత స‌క్సెస్‌ల‌ను సాధించ‌డంలో వెనుక‌బ‌డ్డాడు. ఇక తేజ అనే డైరెక్ట‌ర్ లేడేమో అని అనుకుంటున్న స‌మ‌యంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో స‌క్సెస్ సాధించి మ‌ళ్లీ త‌న ఉనికిని చాటుకున్నాడు.

సీనియ‌ర్ ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'ను తెర‌కెక్కించాల్సింది కానీ.. ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు. కానీ త‌ర్వాత తేజ తెర‌కెక్కించిన 'సీత‌' బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఈయ‌న త‌దుప‌రి సినిమాల‌పై ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ త‌రుణంలో తాజాగా ఈయనొక బాలీవుడ్ సినిమాలో ప‌ని చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ స‌మాచారం మేర‌కు తేజ ఇటీవ‌ల కాశ్మీర్ స‌మ‌స్య‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఎత్తేసిన 370 ఆర్టిక‌ల్‌కు సంబంధించి ఓ క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌. స్క్రిప్ట్ పూర్త‌యిన త‌ర్వాతే సినిమాకు సంబ‌ధించిన ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని టాక్‌. బాలీవుడ్‌కి సంబంధించిన ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.

More News

రాయలసీమ పర్యటనకు సిద్ధమైన జనసేనాని

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం.. రెండు చోట్ల పోటీ చేసినా ఒక్కటంటే ఒక్కచోట కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలవలేదు.

సీఎంగా ఉద్ధవ్ ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్

మహారాష్ట్ర రాజకీయాల్లో గత నెలరోజులుగా నెలకొన్న రాజకీయ పరిణామాలకు సుప్రీం కోర్టు చెక్ పెట్టడంతో..

చలానాల ఫ్రస్టేషన్‌తో బైక్‌ను ఏం చేశాడో చూడండి!

బండి రూటు మారినా.. అడ్డం దిడ్డంగా వాహనం వెళ్లినా ట్రాఫిక్ పోలీసులు తాట తీసేస్తున్నారు!. మరీ ముఖ్యంగా

జగన్ ఆరునెలల పాలనపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో సీట్లు సంపాదించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

అమితాబ్‌పై తాప్సీ కౌంటర్‌.. ఫైర్‌ అవుతున్న ఫ్యాన్స్‌

సొట్టబుగ్గల సొగసరి తాప్సీ పన్ను ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసింది.