తేజా? నిజంగా నిజమేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
తేజ పేరు చెప్పగానే, వినగానే అందరికీ ఆయన ఈ మధ్య తప్పుకున్న యన్.టి.ఆర్. బయోపిక్ గుర్తుకొచ్చేస్తుంది. ఈ టైటిల్ చూడగానే మరలా ఆ సినిమాకు సంబంధించ వార్త ఏదో ఉంటుందనే అనుకుంటారు. అలా ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు తేజ గురించి చెప్పుకొంటున్న విషయం ఆయన దర్శకత్వం వహించే తాజా సినిమా గురించి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓసినిమా రూపొందుతోంది. ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ ను దాదాపు 12 కోట్లు పెట్టి తీసుకున్నారట.
తేజ గత చిత్రం భారీగా క్రేజ్‌ను సంపాదించుకోవడంతో ఈ సినిమాకు అది కూడా ప్లస్ అయిందని అంటున్నారు. ఈ చిత్రంలో కాజల్ నాయిక. ఆమె బాలీవుడ్ జనాలకు కూడా బాగా తెలిసిన నటి కావడం, తేజ చిత్రం `నేనే రాజు నేనే మంత్రి`లో నాయిక కావడంతో మరింత ప్లస్ అయిందని వినికిడి. టాలీవుడ్ హంక్ సాయి శ్రీనివాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కు సినిమాలో ప్రాధాన్యం ఇస్తారు. మంచి పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న సినిమాలకు హిందీ శాటిలైట్ రంగంలో మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. అది కూడా ప్లస్ అయిందని సమాచారం. ఏదేమైనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తేజ తన చిత్రాల సక్సెస్‌తో ఇలా మార్కెటింగ్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments