తేజ..ముచ్చటగా మూడోసారి
- IndiaGlitz, [Friday,March 30 2018]
చిత్రం, నువ్వునేను, జయం.. ఇలా సెన్సేషనల్ హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు తేజ. జయం తరువాత పరాజయాల బాట పట్టిన తేజ.. గతేడాది విడుదలైన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం తేజ.. రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణతో రూపొందిస్తున్న యన్.టి.ఆర్ బయోపిక్ కాగా.. మరొకటి వెంకటేష్‌తో తెరకెక్కిస్తున్న ఆటా నాదే వేటా నాదే (ప్రచారంలో ఉన్న పేరు).
ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నాయి. యన్.టి.ఆర్ బయోపిక్‌ను దసరాకి విడుదల చేయబోతున్నట్లు తేజ స్వయంగా ప్రకటించారు. ఇక వెంకటేష్ నటించే సినిమా కూడా ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. 2001లో ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను, ... 2005లో ధైర్యం, ఔనన్నా కాదన్నా.. ఇలా ఇప్పటివరకు రెండు సంవత్సరాల్లో రెండేసి సినిమాలతో సందడి చేసిన తేజ.. మళ్ళీ 13 ఏళ్ళ తరువాత ముచ్చటగా మూడోసారి ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో పలకరించబోతున్నారన్నమాట.