తేజకు అలివేలు దొరికింది.. కానీ..!

  • IndiaGlitz, [Saturday,January 02 2021]

డైరెక్ట‌ర్ తేజ ఒకేసారి రెండు సినిమాల‌ను అనౌన్స్‌చేశాడు. అందులో ఓ చిత్రం ‘అలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ‌’. ఇందులో ముందుగా వెంక‌ట‌ర‌మ‌ణ పాత్ర‌కు గోపీచంద్‌ను ఓకే చేయించుకున్నాడు. త‌ర్వాత అలివేలు పాత్ర‌కు వెతుకులాట ప్రారంభించాడు. ఎంత మంది హీరోయిన్స్‌ను క‌లిసి ఎందుక‌నో తేజ‌కు వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే ఈలోపు గోపీచంద్‌కు మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. యువీ క్రియేష‌న్స్‌లో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. యువీ సంస్థ త‌న స్నేహితుడు ప్ర‌భాస్‌కు సంబంధించింది కావ‌డంతో గోపీచంద్ కూడా ఆ సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపించి తేజ సినిమా నుండి డ్రాప్ అయ్యాడు.

తీరా గోపీచంద్ వెళ్లిపోయాక‌.. అలివేలు పాత్ర‌లో న‌టించ‌డానికి తాప్సీ ఒప్పుకుంది. దీంతో ఇప్పుడు తేజ‌కు మ‌ళ్లీ వెతుక్కునే ప‌ని ప‌డింది. ఈసారి వెంక‌ట ర‌మ‌ణ‌ను వెతుక్కునే ప‌ని ప‌డింది. అయితే సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఓ పరభాషకు సంబంధించి ఓ చిన్న హీరోను ఇందులో నటింప చేసి తాప్సీకి ఎక్కువ క్రెడిట్ దక్కేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నాడని టాక్. మ‌రి వెంక‌ట‌ర‌మ‌ణ‌గా ఎవ‌రు న‌టిస్తార‌నేది ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మే. ప్ర‌స్తుతం వ‌రుస బాలీవుడ్ సినిమాలు చేస్తున్న తాప్సీ ఎప్పుడు తేజ సినిమాలో జాయిన్ అవుతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.