నాలుగోసారి తేజ, అనూప్ కాంబినేషన్‌లో మూవీ

  • IndiaGlitz, [Friday,June 29 2018]

సంచలన దర్శకుడు తేజ ‘చిత్రం’తో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న విషయం తెలిసిందే. తన సినిమాలతో ఎంతో మంది నటీనటులకు, మ్యూజిక్ డైరెక్టర్‌లకు బ్రేక్‌ ఇచ్చారు తేజ. అలా తాను పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్‌లలో యువ సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ ఒకరు.

తేజ డైరెక్షన్‌లో 2004లో వచ్చిన 'జై' చిత్రంతో అనూప్ సంగీత దర్శకుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత 2005లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధైర్యం' చిత్రానికి కూడా సంగీతాన్ని అందించారు. కట్ చేస్తే.. మళ్ళీ వీరిద్దరి కలయికలో 12 సంవత్సరాల అనంతరం అంటే గత ఏడాది ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విడుదలైంది.

మళ్ళీ ఇప్పుడు ఈ కాంబోలో నాలుగో చిత్రంగా మరో మూవీ రాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతోంది. దీనికి అనూప్ రూబెన్స్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారట‌ తేజ. ఇప్పటికే అనూప్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్‌ పూర్తి చేసుకుని, రెండు ట్యూన్స్‌ను కూడా ఫైనల్ చేసారట‌ తేజ.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నార‌ని స‌మాచారం. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వ‌ర‌లోనే వెల్లడి కానున్నాయి.

More News

దిల్ రాజు ఆ విష‌యంలో హ్యాట్రిక్ కొడ‌తారా?

ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు.. వీళ్ళంతా మల్టీస్టారర్ మూవీస్‌తో సందడి చేసినవారే.

విలన్ పాత్రలో మణిరత్నం హీరోయిన్

నటనకు స్కోప్ ఉండే పాత్రల్లో నటించేందుకే.. నటీనటులు ఎప్పుడూ ప్రాముఖ్య‌త ఇస్తూ ఉంటారు. అందులోనూ నెగటివ్ రోల్ అంటే.. వారిలోని  బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వొచ్చనే ఉద్దేశంతో కొంతమంది స్టార్ హీరోస్

షర్టు లేకుండా చైతు యాక్షన్ సీన్

యువ కథానాయకుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సవ్యసాచి'.

'ఈ మాయ పేరేమిటో' చిత్రానికి నాని వాయిస్ ఓవ‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు వంటి స్టార్స్ అంద‌రూ వారి న‌ట‌న‌తోనే కాదు..

ఫేవరెట్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన సమంత

2018.. ప్ర‌థ‌మార్థం సమంతకు బాగా కలిసొచ్చింది. గడచిన ఈ ఆరు నెలల్లో ఆమె క‌థానాయిక‌గా నటించిన 'రంగస్థలం' తెలుగులో ఘ‌న విజ‌యం సాధించ‌గా