నాలుగోసారి తేజ, అనూప్ కాంబినేషన్లో మూవీ
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు తేజ ‘చిత్రం’తో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న విషయం తెలిసిందే. తన సినిమాలతో ఎంతో మంది నటీనటులకు, మ్యూజిక్ డైరెక్టర్లకు బ్రేక్ ఇచ్చారు తేజ. అలా తాను పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్లలో యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఒకరు.
తేజ డైరెక్షన్లో 2004లో వచ్చిన 'జై' చిత్రంతో అనూప్ సంగీత దర్శకుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత 2005లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధైర్యం' చిత్రానికి కూడా సంగీతాన్ని అందించారు. కట్ చేస్తే.. మళ్ళీ వీరిద్దరి కలయికలో 12 సంవత్సరాల అనంతరం అంటే గత ఏడాది ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విడుదలైంది.
మళ్ళీ ఇప్పుడు ఈ కాంబోలో నాలుగో చిత్రంగా మరో మూవీ రాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతోంది. దీనికి అనూప్ రూబెన్స్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారట తేజ. ఇప్పటికే అనూప్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసుకుని, రెండు ట్యూన్స్‌ను కూడా ఫైనల్ చేసారట తేజ.
యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారని సమాచారం. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com